Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Currency: డిజిటల్ కరెన్సీ తయారీ దిశగా రిజర్వ్ బ్యాంక్ అడుగులు.. రూపకల్పనలో కంగారులు

న్యూజిలాండ్ తన సొంత డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ కరెన్సీ రాకతో దేశంలో చెల్లింపు వ్యవస్థలో పెద్ద మార్పు ఉంటుందని..

Digital Currency: డిజిటల్ కరెన్సీ తయారీ దిశగా రిజర్వ్ బ్యాంక్ అడుగులు.. రూపకల్పనలో కంగారులు
New Zealand Digital Currenc
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 04, 2021 | 11:05 AM

New Zealand Digital Currency: న్యూజిలాండ్ తన సొంత డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ తన సొంత డిజిటల్ కరెన్సీని తయారు చేసే పనిలో బిజీగా ఉంది. అతి త్వరలో డిజిటల్ కరెన్సీ మార్కెట్‌లోకి రానుంది. ఇటీవలి నెలల్లో నగదు లావాదేవీలు తగ్గాయని ప్రజలు విచక్షణారహితంగా డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారని న్యూజిలాండ్ గుర్తించింది. అటువంటి పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ తన డిజిటల్ కరెన్సీని పరిచయం చేసేందుకు చూస్తోంది.

న్యూజిలాండ్ డిజిటల్ కరెన్సీ రాకతో దేశంలో చెల్లింపు వ్యవస్థలో పెద్ద మార్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో దేశ ప్రజల నుండి అభిప్రాయాన్ని కోరింది ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్. కొన్ని ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్‌ను వడదుల చేసింది. దీనిలో డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు గురించి అడిగారు. రోజు రోజుకు తగ్గుతున్న నగదు ధోరణి మధ్య  డిజిటల్ కరెన్సీ ధోరణిని పెంచడానికి ప్రాధాన్యత పెరిగింది. వాణిజ్య బ్యాంకులతోపాటు వివిధ వ్యవహారాల్లో నగదుతోపాటు డిజిటల్ కరెన్సీని ఏర్పాటు చేసేందుకు చూస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ 

న్యూజిలాండ్‌లో తగ్గిన నగదు లావాదేవీలు 

న్యూజిలాండ్ నివేదిక ప్రకారం గృహాలలో నగదు లావాదేవీలు 2007 లో 30 శాతం నుండి 2019 లో 19 శాతం తగ్గాయి. ప్రజలు ఫోన్ ఆధారిత యాప్‌ల నుండి చెల్లింపుపై అధిక దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో డిజిటల్ వాలెట్ ధోరణి కూడా వేగంగా పెరిగింది. ఈ పనిలో అనేక ప్రైవేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇది ప్రజల లావాదేవీని చాలా సులభతరం చేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ ‘యాపిల్ పే’ లావాదేవీకి సమర్థవంతమైన ఆయుధంగా భావించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది.

న్యూజిలాండ్‌లో కాయిన్స్..

ఇటీవలి నెలల్లో న్యూజిలాండ్‌లో నగదు లావాదేవీలు క్షీణించాయి. స్టేబుల్ కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీలు వేగంగా పెరిగాయి. దీని కారణంగా సెంట్రల్ బ్యాంక్ భవిష్యత్తులో డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి దృష్టి పెట్టింది. సాంకేతిక భాషలో దీనిని CBDC లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటైజ్డ్ కరెన్సీ అని పిలుస్తారు. స్థిరమైన నాణెం అనేది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ ఇది సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీగా గుర్తించబడుతుంది. బాండ్‌లు మొదలైన ప్రభుత్వ ఆస్తుల మద్దతుతో ఈ కరెన్సీ నడుస్తుంది. దేశ ప్రజలకు నచ్చేలా ఈ కాయిన్ తయారు చేస్తున్నామని రిజర్వు బ్యాంకు తెలిపింది. 

ఎల్ సాల్వడార్‌లో బిట్‌కాయిన్ గుర్తింపు

బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీ చేసిన తొలి దేశంగా ఎల్‌సాల్వడార్ రికార్డులకెక్కింది. ఆ దేశంలోని పౌరులు అన్ని లావాదేవీలను బిట్ కాయిన్ ఆదారంగా సాగిస్తున్నారు. ఎల్ సాల్వడార్‌లో బిట్‌కాయిన్ ఎటిఎంలు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. దీని నుండి ప్రజలు బ్యాంకుల వంటి క్రిప్టోకరెన్సీని ఉపసంహరించుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. ఎల్-సాల్వడార్ సాధారణ లావాదేవీల నుండి ఉద్యోగుల జీతం వరకు బిట్‌కాయిన్ ప్రసరణను పెంచింది. ఇదే విధమైన వ్యవస్థను న్యూజిలాండ్‌లో చూడవచ్చు. క్రిప్టోకరెన్సీ ద్వారా ట్రేడింగ్ జరగడం ద్వారా ప్రవాసులు ఇంటికి పంపిన డబ్బుపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు విధించే ఫీజులో దేశానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు ఆదా చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా చేస్తూ జూన్‌లో ఎల్‌సాల్వడార్ పార్లమెంటు చట్టం చేయగా, ఇప్పుడీ చట్టానికి ఇది లోబడి ఉంటుంది. అప్పట్లో దీనిని వస్తు, సేవల వ్యాపారానికి మాత్రమే అనుమతి ఇవ్వగా ఈ చట్టానికి 24 గంటల్లోనే అధ్యక్షుడు నయీబ్ బుకేలే ఆమోదించారు. డిసెంబర్ 6 లోపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ డిజిటల్ కరెన్సీపై ప్రజల అభిప్రాయాన్ని కోరింది.

 ఇవి కూడా చదవండి: Consumer Right: మీరు తినే ఐస్ క్రీం ప్రమాదకారి కావొచ్చు.. తెలుసా..? ఆ కోడ్ లేకపోతే నకిలీదే..

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా పండగకు జేబీఎస్ నుంచి జిల్లాలకు అతి తక్కువ ధరలో ఓల్వో బస్సు సర్వీసులు