AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కీచక తండ్రి.. మద్యం తాగించి కన్న కూతురిపైనే అఘాయిత్యం.. ఆ తర్వాత వీడియోలు తీసి..

Andhra Pradesh Crime News: దేశంలో ఎన్నో చట్టాలు అమలవుతున్నప్పటికీ.. బాలికలపై దారుణాలు ఆగడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడయ్యాడు. మద్యం తాగించి కూతురిపైనే

Crime News: కీచక తండ్రి.. మద్యం తాగించి కన్న కూతురిపైనే అఘాయిత్యం.. ఆ తర్వాత వీడియోలు తీసి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Oct 04, 2021 | 12:31 PM

Share

Andhra Pradesh Crime News: దేశంలో ఎన్నో చట్టాలు అమలవుతున్నప్పటికీ.. బాలికలపై దారుణాలు ఆగడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడయ్యాడు. మద్యం తాగించి కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ప్రియురాలితో వీడియో కూడా తీయిచి రాక్షసానందం పొందాడు ఆ కీచక తండ్రి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురంలో నివసిస్తున్న ఓ వ్యక్తి కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలోని బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధమేర్పడింది. ఈ క్రమంలో జూలైలో మార్కాపురం వచ్చిన నిందితుడు.. తన 15 ఏళ్ల కూతురిని అక్కడి నుంచి బేస్తవారి పేటకు తీసుకెళ్లాడు. అనంతరం సదరు మహిళతో కలిసి బాలికకు బలవంతంగా మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే.. ఈ ఘటనను మహిళ ఫోన్‌లో చిత్రీకరించింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ నిందితుడు బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. అనంతరం ఆమెను ప్రకాశం జిల్లాలో.. మరోచోట తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంకో మహిళ ఇంటికి కూడా తీసుకెళ్లి నెలన్నరపాటు అక్కడే ఉంచాడు.

అయితే.. సొంత భార్యకు కుమార్తె తన వద్దే ఉందంటూ మభ్యపెడుతూ ఫోన్‌లో మాట్లాడించేవాడు. ఈ క్రమంలో సెప్టెంబరు రెండో వారంలో ఓ బంధువు చనిపోతే కార్యక్రమానికి కూతురితో కలిసి తండ్రి హాజరయ్యాడు. అక్కడ బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి.. ఆరా తీసి వివరాలు తెలుసుకుంది. భర్త వివాహేతర సంబంధాలు, కూతురిపై అత్యాచారం గురించి తెలుసుకున్న బాలిక తల్లి సెప్టెంబరు 25న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఈ నెల 2న సాయంత్రం నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి దగ్గర ఉన్న మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

Also Read:

Mobile Game: హైదరాబాద్‌లో విషాదం.. ఫోన్‌లో గేమ్ ఆడొద్దన్నందుకు బాలిక బలవన్మరణం.. రాత్రి వేళ ఇంట్లో..

Shah Rukh Khan Son: ఆర్యన్‌ఖాన్‌ s/o షారూక్‌. నాలుగేళ్లుగా డ్రగ్స్‌కు బానిస. ఇండియా, ఫారిన్.. ఎక్కడికెళ్లినా భారీ వినియోగం.!