UP: లఖీంపూర్ టు లక్నో.. రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో యూపీలో హైటెన్షన్

లక్నో టు లఖీంపూర్‌.. టోటల్‌గా యూపీలో హైటెన్షన్‌. కేంద్రమంత్రి కొడుకు రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో ఉత్తరప్రదేశ్‌

UP: లఖీంపూర్ టు లక్నో.. రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో యూపీలో హైటెన్షన్
Lucknow
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 04, 2021 | 11:19 AM

Uttar Pradesh Lakhimpur Kheri violences: లక్నో టు లఖీంపూర్‌.. టోటల్‌గా యూపీలో హైటెన్షన్‌. కేంద్రమంత్రి కొడుకు రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో ఉత్తరప్రదేశ్‌ అట్టుడికిపోతోంది. తాజాగా.. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్ ఇంటిదగ్గర కారును దగ్దం చేశారు ఆందోళన కారులు.

యూపీ లఖీంపూర్‌ ఖేరీలో హై టెన్షన్‌ నెలకొంది. నిన్న రైతుల ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఖీంపూర్‌ఖేరీకి వెళ్లనున్నారు విపక్ష సభ్యులు. దీంతో లఖీంపూర్‌ఖేరీలో 144 సెక్షన్‌ విధించారు. లఖీంపూర్‌ ఘటన నేపథ్యంలో ఢిల్లీలో కూడా ఆంక్షలు విధించారు. సింఘు, ఘాజీ బోర్డర్లను పూర్తిగా మూసివేశారు.

ప్రియాంకగాధీ, అఖిలేష్‌ యాదవ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం సహా పలువురు నేతలు లఖింపూర్‌ఖేరీకి వెళ్లి రైతులను పరామర్శించనున్నారు. ఐతే నేతలెవరూ రాకుండా నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. బారికేడ్లు, వాహనాలను అడ్డంగా పెట్టి భారీగా బలగాలను మోహరించారు. లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుంగా ప్రియాంకగాంధీని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు అఖిలేష్‌ యాదవ్‌ను అడ్డుకోవడంతో ఆయన ధర్నాకు దిగారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. కేంద్రమంత్రి కాన్వాయ్‌ రైతులపైకి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో ఆగ్రహంతో పలు వాహనాలకు నిప్పు పెట్టారు అన్నదాతలు. ఐతే కాన్వాయ్‌లో తన కుమారుడు లేడంటున్నారు మిశ్రా. రైతుల దాడిలో కాన్వాయ్‌ బోల్తా పడిందని అంటున్నారు.

Read also: National News: దేశవ్యాప్తంగా అనూహ్య ఘటనలు.. జాతీయవార్తల సమాహారం. నేటి నేషనల్ రౌండప్. టూకీగా..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!