Robbery: తలుపు కొట్టారు.. రూ.లక్షలు దోచుకెళ్లారు.. పట్టపగలు దోపిడి దొంగల బీభత్సం..
పంచశీల్ నగర్‌కు చెందిన ప్రొఫెసర్ శిశిర్ తివారీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన కుటుంబాన్ని బందీలుగా ఉంచారని తెలిపారు.
Gwalior Robbery: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముగ్గురు ముసుగు దొంగలు ప్రొఫెసర్ కుటుంబాన్ని బంధించి తుపాకీతో బెదిరించారు. అనంతరం లక్షల రూపాయలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం గోలక మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచశీల్ నగర్‌లో చోటుచేసుకుంది. దోపిడీ జరిగిన సమయంలో ప్రొఫెసర్ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. పంచశీల్ నగర్‌కు చెందిన ప్రొఫెసర్ శిశిర్ తివారీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన కుటుంబాన్ని బందీలుగా ఉంచారని తెలిపారు. తుపాకీతో బెదిరించి లక్షల విలువైన నగదు, విలువైన వస్తువులను దోచుకున్నారని తెలిపారు. మొదట దొంగలు ప్రొఫెసర్ ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తలుపు తీసిన శ్వేతా దీక్షిత్‌కు తమని ప్రొఫెసర్ పంపారని చెప్పడంతో వారిని లోనికి అనుమతించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటి బయట అమర్చిన సీసీ కెమెరాలో ఐదుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై ఇంటికి వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే దోపిడీకి పాల్పడిన ముగ్గురిని వదిలి.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు పారిపోయారు.
వారు లోపలికి వచ్చిన వెంటనే, వారు శ్వేతపై తుపాకీని గురిపెట్టి, ఆమె అత్త, కుమార్తెతో సహా ఇతర కుటుంబ సభ్యులందరినీ బందీలుగా చేసుకున్నారు. రూ.60 వేల నగదు, లక్షల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు దాదాపు 20 నిమిషాల పాటు ఇంట్లోనే ఉండి విలువైన వస్తువులను సేకరించి పరారయ్యారని శ్వేత తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనాస్థలిని పరిశీలించిందని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..