AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ట్యాంక్ క్లీన్ చేసేందుకు దిగి.. పైపులో ఇరుక్కుని.. ఆఖరుకు

ఖమ్మంలో(Khammam) ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. వాటర్ పైప్ లో ఇరుక్కుని మున్సిపల్‌ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత ట్రాజెడీగా జరిగిన ఈ ప్రమాదంలో కార్మికుడి మృతదేహాన్ని ...

Telangana: ట్యాంక్ క్లీన్ చేసేందుకు దిగి.. పైపులో ఇరుక్కుని.. ఆఖరుకు
Crime
Ganesh Mudavath
| Edited By: Rajeev Rayala|

Updated on: Jun 08, 2022 | 10:12 AM

Share

ఖమ్మంలో(Khammam) ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. వాటర్ పైప్ లో ఇరుక్కుని మున్సిపల్‌ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత ట్రాజెడీగా జరిగిన ఈ ప్రమాదంలో కార్మికుడి మృతదేహాన్ని బయటికి తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఖమ్మం మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్న చిర్రా సందీప్‌ ప్రభుత్వ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్‌ క్లీన్‌ చేసేందుకు దిగాడు. సందీప్‌తోపాటు మరో ముగ్గురు కార్మికులు ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంక్‌ లోపల శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు వాటర్‌ పైప్‌లో ఇరుక్కుపోయాడు సందీప్‌. పైప్‌లో నుంచి బయటికి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలో పూర్తిగా పైప్‌ లైన్‌లోకి జారిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్‌ సందీప్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. జేసీబీలతో తవ్వి, పైప్‌లైన్‌లో ఇరుక్కుపోయిన కార్మికుడిని సేఫ్‌గా బయటికి తీసేందుకు ఆపరేషన్‌ నిర్వహించారు. మున్సిపల్, ఫైర్‌, డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే, రెస్క్యూ ఆపరేషన్‌ గంటల తరబడి సాగడంతో సందీప్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. పైప్‌లైన్‌ పగలగొట్టి బయటికి తీసేసరికే సందీప్ విగతజీవిగా మారాడు.

పైప్‌లైన్‌లోకి జారిపోయిన సందీప్‌, ఎక్కడి వరకు వెళ్లాడో, ఎక్కడ ఇరుక్కుపోయాడో గుర్తించడం కష్టంగా మారడం, మట్టిని తవ్వి, పైప్‌లైన్లను పగలగొట్టడానికి రెండు గంటల టైమ్‌ పట్టడంతోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుడు సందీప్‌ మృతితో కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, మున్సిపల్‌ కార్మికులు ఆందోళన చేపట్టాయి. మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. సందీప్‌ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

సందీప్‌ మృతికి మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌కి వెంటనే సమాచారం ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్‌ చేపట్టడంలో ఆలస్యం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఉండే సందీప్‌ బతికి ఉండేవాడని కన్నీటి పర్యమంతమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి