GHMC Corporators: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మోడీ ఆత్మీయ సమ్మేళనం… సారాంశం ఏంటంటే…!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జీహెచ్ఎంసీ బిజెపి కార్పొరేటర్లతో ఢిల్లీ లో భేటీ అయ్యారు. ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లతో మోడీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జీహెచ్ఎంసీ బిజెపి కార్పొరేటర్లతో ఢిల్లీ లో భేటీ అయ్యారు. ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లతో మోడీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు మోడీ నుంచి ఆత్మీయ పలకరింపు దక్కింది. సాయంత్రం 4గంటలకు కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్, గ్రామీణం, మేడ్చల్ అర్బన్, గ్రామీణం, సికింద్రాబాద్, సెంట్రల్ జిల్లా అధ్యక్షులు మోడీ తో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వీరితో మోడీ సమావేశమయ్యారు.
ప్రతి కార్పొరేటర్ వద్దకు వచ్చిన మోడీ వారి వివరాలు, వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి పిల్లలు, విద్యాభ్యాసం తదితరాలను కూడా మోడీ అడిగి తెలుసుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఉన్న నేత నుంచి ఈ తరహా పలకరింపు ఎదురయ్యేసరికి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. గడచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటారని కార్పొరేటర్లను మెచ్చుకున్న మోడీ… త్వరలో రానున్న ఎన్నికల్లో మరింత మేర సత్తా చాటాలని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని, హైదరాబాద్‌లో బీజేపీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఆయన కార్పొరేటర్లను కోరారు.