AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: నేడు కొత్త ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న ఆర్బీఐ.. రుణాలు మరింత ప్రియం..!

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) 8 జూన్ 2022న బుధవారం RBI కొత్త ద్రవ్య విధానాన్ని ప్రకటించనుంది. ఇందులో ఆర్‌బీఐ వరుసగా రెండో నెల రెపో రేటును..

RBI: నేడు కొత్త ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న ఆర్బీఐ.. రుణాలు మరింత ప్రియం..!
Subhash Goud
|

Updated on: Jun 08, 2022 | 5:10 AM

Share

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) 8 జూన్ 2022న బుధవారం RBI కొత్త ద్రవ్య విధానాన్ని ప్రకటించనుంది. ఇందులో ఆర్‌బీఐ వరుసగా రెండో నెల రెపో రేటును పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో, సెంట్రల్ బ్యాంక్ CRR అంటే నగదు నిల్వల నిష్పత్తిని కూడా పెంచవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి జూన్ 6 నుంచి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరుగుతుండగా, మూడో రోజు భేటీలో ఆర్‌బీఐ గవర్నర్‌ కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు.

మేలో రుణాలు ఖరీదైనవి

మే 4న, RBI రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి పెంచింది. ఆ తర్వాత అన్ని బ్యాంకులు రుణాన్ని ఖరీదైనవిగా చేశాయి. దీంతో ఈఎంఐ ఖరీదైనవి మారాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోని అదనపు నగదును తొలగించేందుకు వీలుగా ఆర్‌బీఐ కూడా సీఆర్‌ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.50 శాతానికి పెంచింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్‌బీఐ బుధవారం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. దీనితో పాటు, CRR ను కూడా పెంచవచ్చు. అయితే CRR పెంచవద్దని బ్యాంకులు RBIని అభ్యర్థించాయి.

ఇవి కూడా చదవండి

జూన్‌లో వడ్డీ రేట్లు

జూన్‌లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇటీవల ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. అదే సమయంలో, RBI ప్రకటనకు ముందే చాలా బ్యాంకులు MCLR ను పెంచాయి. దీంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. RBI తన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటులో 25 నుండి 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలను ప్రకటించవచ్చు. రెపో రేటును పెంచవచ్చు. ఇది జరిగితే, మీ EMI మరింత ఖరీదైనది కావచ్చు. బుధవారం ఉదయం 10 గంటలకు ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి