Virat Kohli Car Collection: విరాట్‌ కోహ్లీకి ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా..? వాటి ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Virat Kohli Car Collection: ప్రముఖ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బలమైన..

Virat Kohli Car Collection: విరాట్‌ కోహ్లీకి ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా..? వాటి ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2022 | 7:39 AM

Virat Kohli Car Collection: ప్రముఖ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . విరాట్ కోహ్లీ మైదానం వెలుపల అతని జీవితాన్ని అతని అభిమానులు నిశితంగా గమనిస్తూ ఉంటారు. రిపోర్టుల ప్రకారం.. విరాట్ కోహ్లీ దాదాపు రూ.980 కోట్ల ఆస్తులకు యజమాని. అత్యుత్తమ బ్యాటింగ్‌కు పేరుగాంచిన కోహ్లీ తన అభిరుచికి కూడా పేరుగాంచాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలాగే విరాట్ కోహ్లీకి కూడా కార్లంటే చాలా ఇష్టం. వారు ఖరీదైన కార్ల కొనుగోళ్లలు ముందుంటారు.

ఆడి క్యూ7:

విరాట్ కోహ్లీ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి బ్రాండ్ అంబాసిడర్. అయితే బ్రాండ్ అంబాసిడర్ కాకముందే, స్పోర్టీ వైట్ కలర్ ఆడి క్యూ7 కారును కొనుగోలు చేశాడు. భారతదేశంలో దీని ధర వేరియంట్‌ను బట్టి రూ. 69.2781.18 లక్షలు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో విరాట్ కోహ్లీ ఈ కారును స్టైలిష్ స్పోర్టీ బీస్ట్‌గా అభివర్ణించాడు.

ఇవి కూడా చదవండి

ఆడి RS5:

ఆడి బ్రాండ్ అంబాసిడర్ అయిన తర్వాత కోహ్లి తన కార్ల కలెక్షన్ ను పెంచుకోవాల్సి వచ్చింది. లగ్జరీ కార్ బ్రాండ్ అంబాసిడర్ అయిన తర్వాత ఆడి తన కార్ల కొనుగోళ్లలో మరో మోడల్‌ చేరింది. ఈసారి కోహ్లి దేశపు తొలి ఆడి ఆర్ఎస్5కి యజమాని అయ్యాడు. కారులో విలాసవంతమైన, ప్రీమియం కారు ధర రూ. 1.1 కోట్లు.

ల్యాండ్ రోవర్ వోగ్:

విరాట్ కోహ్లి మెరుస్తున్న తెలుపు రంగు ల్యాండ్ రోవర్ వోగ్‌ని కూడా కొనుగోలు చేశాడు. దేశంలోని అనేక మంది ప్రముఖుల కార్ల సేకరణలో ఈ కారు చేర్చబడింది. భారత మాజీ కెప్టెన్ ఢిల్లీ వీధుల్లో ఎస్‌యూవీని నడుపుతూ కనిపించాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కారు విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 1818తో రిజిస్టర్ చేయబడింది. దీని ధర రూ.2.26 కోట్లు.

బెంట్లీ ఫ్లయింగ్ స్పర్:

దేశంలోని అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటైన బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కూడా విరాట్ కోహ్లీ కార్ల కలెక్షన్‌లో చేరింది. ఈ కారు కూడా 1818 నంబర్‌తో రిజిస్టర్ చేయబడింది. ఫ్లయింగ్ స్పర్ శక్తివంతమైన 6.0-లీటర్ W12 ఇంజన్‌తో శక్తిని అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 333 కి.మీ. బెంట్లీ స్టైలిష్ కారు ధర గురించి చెప్పాలంటే ఈ అందమైన కారు రూ.1.703.41 కోట్లకు వస్తుంది.

బెంట్లీ కాంటినెంటల్ GT:

2018లో విరాట్ కోహ్లీ తన సోదరుడు ‘వికాస్’ పేరిట బెంట్లీ కాంటినెంటల్ GTని కొనుగోలు చేశాడు. కోహ్లీ ఢిల్లీలో ఉన్నప్పుడల్లా వైట్ కలర్ లగ్జరీ కాంటినెంటల్ కారును నడుపుతుంటాడు. ఈ స్పోర్ట్స్ కారు దేశంలోనే అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ.3.294.04 కోట్లు. ఈ విధంగా కోహ్లికి అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి