Fake Facebook Account: మీకు తెలియకుండానే మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా..? డిలీట్‌ చేయండిలా..!

Fake Facebook Account: ఈ రోజుల్లో నకిలీవి అధికంగా పుట్టుకొస్తున్నాయి. డాక్యుమెంట్లు కూడా నకిలీ తయారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు..

Fake Facebook Account: మీకు తెలియకుండానే మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా..? డిలీట్‌ చేయండిలా..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 07, 2022 | 6:34 AM

Fake Facebook Account: ఈ రోజుల్లో నకిలీవి అధికంగా పుట్టుకొస్తున్నాయి. డాక్యుమెంట్లు కూడా నకిలీ తయారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇక చాలా మంది ఎక్కువగా ఉపయోగించేది ఫేస్‌బుక్‌. ఈ అకౌంట్‌ను కూడా నకిలీ సృష్టించి నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లతో మోసాలు పెరిగిపోతున్నాయి. నకిలీ ఫేస్‌బుక్‌ సృష్టించి వాటి ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతున్నారు. వాళ్ల రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయగానే అత్యవసరంగా కొంత డబ్బు అవసరం ఉందని అడుగుతున్నారు. ఇది నిజమే అనుకుని చాలా మంది డబ్బులు పంపిస్తూ మోసపోతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. పోలీసులకు కూడా ఎన్నో ఫిర్యాదు కూడా అందాయి. దీంతో పోలీసులు కూడా అలాంటి ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను గుర్తించినప్పుడు పోలీసులకు తెలియకుండానే మనమే డిలీట్‌ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే మీకు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉండి, తర్వాత ఎక్కువగా ఉన్న అకౌంట్లను డిలీట్‌ చేయాలంటే కొన్ని టిప్స్‌ ద్వారా ఆ అకౌంట్లను తొలగించుకోవచ్చు. అది ఎలాగోతెలుసుకుందాం.

► మీ పేరుపై నకిలీ ఖాతా కాగా, మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండి మిగతా ఖాతాలను డిలీట్‌ చేయాలని ముందుగా అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలి.

► అకౌంట్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ప్రొఫైల్‌ ఫోటో కింద కుడివైపు మూడు చుక్కల మీద క్లిక్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

► ఆ తర్వాత find support or report profile ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

► అప్పుడు ఎందుకు రిపోర్ట్ చేస్తున్నామో కొన్ని కార‌ణాల‌ను తెరపై చూపిస్తుంది.

► వాటిలో ఫేక్‌ అకౌంట్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి రిపోర్టు ప్రక్రియను పూర్తి చేయాలి.

► మీరు మాత్రమే కాకుండా మీ మిత్రులు మరో 20 మందితో ఇదే విధంగా ఆ అకౌంట్‌పై రిపోర్టు చేయించాలి.

►అప్పుడు ఫేస్‌బుక్‌ దీనిని పరిశీలించి నకిలీ ఖాతా ఉన్నట్లు డిలీట్‌ చేస్తుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే