Smart Phone Lost: మీ స్మార్ట్ ఫోన్ పోయింది.. అయితే, వెంటనే ఈ పనులు చేయాల్సిందే..!

Smart Phone Lost: ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తోంది స్మార్ట్‌ ఫోన్‌. మన అవసరాలు, అభిరుచుల సమాచారం కోసం వెబ్‌ సైట్స్‌, యాప్స్‌లో వెతకడం సర్వసాధారణం అయ్యింది.

Smart Phone Lost: మీ స్మార్ట్ ఫోన్ పోయింది.. అయితే, వెంటనే ఈ పనులు చేయాల్సిందే..!
Smart Phone
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 06, 2022 | 8:31 PM

Smart Phone Lost: ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తోంది స్మార్ట్‌ ఫోన్‌. మన అవసరాలు, అభిరుచుల సమాచారం కోసం వెబ్‌ సైట్స్‌, యాప్స్‌లో వెతకడం సర్వసాధారణం అయ్యింది. ఇలాంటి సమయంలోనే సగటు స్మార్ట్‌ ఫోన్‌ యూజర్‌ తన వ్యక్తిగత డేటా మొత్తాన్ని తన సెల్‌ఫోన్‌లోనే దాచుకుంటున్నాడు. అయితే స్మార్ట్‌ఫోన్‌ ఎక్కడైనా మరిచిపోయినా, పడిపోయినా లేదా దొంగతానికి గురైనా వెంటనే కొన్ని చర్యలు తప్పక తీసుకోవాలి. ఈ జాగ్రత్తల ద్వారా మీ ఫోన్‌ మళ్లీ దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనిపెట్టలేకపోతే మీ విలువైన డేటా అపరిచితుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఇప్పుడున్న అన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లలో ఫైండ్ మై డివైజ్ ఆన్‌లోనే ఉంటుంది. గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉండే ఈ సర్వీస్ మీ ఫోన్‌ ఎక్కడుందో లొకేట్ చేయగలుగుతుంది. అందుకే మీ మొబైల్‌ పోయిన వెంటనే.. కంప్యూటర్ లేదా వేరే స్మార్ట్‌ఫోన్‌లో ఫైండ్ మై డివైజ్ ఓపెన్ చేసి మీ జీమెయిల్‌తో లాగిన్ అవండి. దాంట్లో ఫైండ్ మై డివైజ్ ఎంచుకుంటే మీ ఫోన్‌ ఏ ప్రాంతంలో ఉందో కనిపెట్టవచ్చు. అయితే ఇలా ఫైండ్‌ మై డివైజ్‌ సెర్చ్‌ చేసే సమయంలో మిస్సైన ఈ మొబైల్‌ డేటా, జీపీఎస్ ఆన్‌లో ఉంటే ఇది కచ్చితంగా పని చేస్తుంది.

ఫైండ్ మై డివైజ్‌ ద్వారా పోగోట్టుకున్న మీ ఫోన్‌కు లాక్ వేయవచ్చు. అలాగే లాక్ స్క్రీన్‌పై కనపడేలా మెసేజ్ పంపవచ్చు. ఆ ఫోన్‌ దొరికిన వారికి.. దాని ఓనర్ మీరేనని కాంటాక్ట్ నంబర్‌ కూడా మెసేజ్‌ పెట్టవచ్చు. ఇక అన్ని ప్రయత్నాలు చేసినా.. ఫోన్‌ దొరకక ఇక పోయినట్టే అని ఫిక్స్ అయ్యాక ఈ పని చేయాలి. ఫైండ్ మీ డివైజ్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోని పూర్తి డేటాను ఎరేజ్ చేసేయవచ్చు. మీ మొబైల్‌ ఇక దొరకదని ఫిక్స్ అయ్యాక.. డేటా దుర్వినియోగం కాకుండా ఎరేజ్ చేయడం చాలా ముఖ్యం. అలాగే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌కు ఐఎంఈఐ నంబర్‌ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మీ ఫోన్‌ పోయిందని నిర్ధారించుకున్నాక ఐఎంఈఐ నంబర్‌ను మీరే బ్లాక్ చేసుకోవచ్చు. ceir.gov.in/Home/index.jsp అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఐఎంఈఐ నంబర్‌ బ్లాక్ చేయవచ్చు.