AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SpiceJet: తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ.. రూ.10 లక్షల జరిమానాపై వివరణ ఇచ్చిన స్పైస్‌జెట్‌

SpiceJet: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది. DGCA తన బోయింగ్ 737 MAX విమానం..

SpiceJet: తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ.. రూ.10 లక్షల జరిమానాపై వివరణ ఇచ్చిన స్పైస్‌జెట్‌
Subhash Goud
| Edited By: |

Updated on: Jun 07, 2022 | 6:34 AM

Share

SpiceJet: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది. DGCA తన బోయింగ్ 737 MAX విమానం పైలట్‌లకు సరిగ్గా లేని సిమ్యులేటర్‌పై శిక్షణ ఇచ్చినందుకు మే 30న ఈ పెనాల్టీని విధించింది. ఎందుకంటే ఇది విమానం భద్రతను ప్రభావితం చేస్తుంది. DGCA గత నెలలో 90 స్పైస్‌జెట్ పైలట్‌లను మాక్స్ విమానాలను నడపకుండా నిషేధించింది. పైలట్లకు సరైన శిక్షణ ఇవ్వలేదని తెలుసుకున్నారు. పైలట్లపై నిషేధం విధించిన తర్వాత రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకేస్ నోటీసు జారీ చేసింది. DGCA ప్రకారం.. విమానయాన సంస్థ పంపిన సమాధానం సరైనది కాదని తేలింది.

ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్‌ దీనిపై సోమవారం వివరణ ఇచ్చింది. మాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నడిపేందుకు 650 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే 90 మంది పైలట్లు తప్పుడు సిమ్యులేటర్లపై శిక్షణ పొందినట్లుగా డీజీసీఏ గుర్తించినట్లు పేర్కొంది. డీజీసీఏ సూచనల మేరకు ఈ 90 మంది పైలట్లను మాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నడపకుండా నిరోధించినట్లు తెలిపింది.

ఈ 90 మంది పైలట్లకు సరైన సిమ్యులేటర్లపై మళ్లీ శిక్షణ ఇస్తాం:

ఇవి కూడా చదవండి

కాగా, ఈ 90 మంది పైలట్లకు సరైన సిమ్యులేటర్లపై మళ్లీ శిక్షణ ఇస్తామని స్పైస్‌జెట్‌ వివరణ ఇచ్చుకుంది. వీరి శిక్షణపై డీజీసీఏ సంతృప్తి చెందితే మాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. ఈ చర్య వల్ల మాక్స్‌ విమానాల ఆపరేషన్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పైస్‌జెట్‌ స్పష్టం చేసింది. తగినంత శిక్షణ పొందిన పైలట్లు సంస్థకు అందుబాటులో ఉన్నారని తెలిపింది.

కాగా, బోయింగ్‌ 737 మాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపేందుకు తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ ఇచ్చిన స్పైస్‌జెట్‌కు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆ 90 మంది స్పైస్‌జెట్‌ పైలట్లు బోయింగ్‌ 737 మాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపకుండా చర్యలు చేపట్టింది. వారి శిక్షణ విమానం భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీంతో 90 మంది పైలట్లకు తిరిగి శిక్షణ ఇవ్వాలని స్పైస్‌జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..