RBI: “కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రం’ మారేనా..? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ..ఇదే ఫైనల్!
భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం. కానీ.. త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు...
భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం. కానీ.. త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ, నోట్లలో ఎలాంటి మార్పులు చేయబోయేది లేదని ఆర్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్న మహాత్ముడి చిత్రాన్ని మార్చే ప్రతిపాదనేదీ లేదని ఆ నోట్ ద్వారా ఆర్బీఐ తేల్చి చెప్పింది. కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రానికి బదులు ఇతర ప్రముఖుల చిత్రాలను ముద్రిస్తారన్న వార్తలను అవాస్తంగా ఆర్బీఐ ప్రకటించింది.
కరెన్సీ నోట్లలో పలు మార్పులు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోందని మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. మహాత్ముడి ముఖ చిత్రానికి బదులుగా ఇతరుల చిత్రాలు వాడుతారనే వార్తల నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక నోట్‌లో విడుదల చేసింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని గుర్తుంచుకోవాలి అంటూ ఆర్బీఐ నోట్ స్పష్టం చేసింది. భారత 11వ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నోబెల్ పురస్కార గ్రహీత, జాతీయ గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్‌ల చిత్రాలను కొన్ని నిర్ధిష్ట బ్యాంకు నోట్లపై ముద్రించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్పందిస్తూ ఇవన్నీ అవాస్తవమని తేల్చిచెప్పింది.