Kerala: కేరళ రాజధానిలో ఉద్రిక్తత.. సీఎం విజయన్ నివాసం వైపు దూసుకొచ్చిన పీఎఫ్ఐ కార్యకర్తలు..
కేరళ ముఖ్యమంత్రి విజయన్ నివాసాన్ని ముట్టడించారు పీఎఫ్ఐ కార్యకర్తలు. పీఎఫ్ఐకు చెందిన బ్యాంక్ ఖాతాలను ఈడీ జప్తు చేయడాన్ని నిరసిస్తూ సీఎం విజయన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. సీఎం నివాసం వైపు దూసుకొచ్చిన కార్యకర్తలపై..
కేరళ రాజధాని త్రివేండ్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) చేపట్టిన ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నివాసాన్ని ముట్టడించారు పీఎఫ్ఐ కార్యకర్తలు. పీఎఫ్ఐకు చెందిన బ్యాంక్ ఖాతాలను ఈడీ జప్తు చేయడాన్ని నిరసిస్తూ సీఎం విజయన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. సీఎం నివాసం వైపు దూసుకొచ్చిన కార్యకర్తలపై పోలీసులు వాటర్‌కెనాన్లు ప్రయోగించారు. భాష్పవాయువు ప్రయోగించారు. PFI సంస్థకు చెందిన 23 బ్యాంక్ ఖాతాలతో పాటు అనుబంధ సంస్థలకు చెందిన 10 బ్యాంక్ ఖాతాలను మనీలాండరింగ్ కేసులో ఈడీ జప్తు చేసింది. దీనిపై దేశవ్యాప్త ఆందోళనలకు PFI పిలుపునిచ్చింది. గల్ఫ్ దేశాల నుంచి బ్యాంక్ ఖాతాలకు అక్రమంగా నిధులు మళ్లిస్తునట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది.
2009 నుంచి PFI బ్యాంక్ ఖాతాల్లో రూ.60 కోట్ల నగదును అక్రమంగా జమ చేసినట్టు ఈడీ దర్యాప్తులో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు అవాస్తమని PFI నేత అంటున్నారు. అక్రమ కేసులపై సీఎం విజయన్ స్పందించడం లేదని ఆయన నివాసాన్ని ముట్టడించారు. భారీ ఎత్తున పీఎఫ్ఐ నాయకులు తరలిరావడంతో కేరళ రాజధాని నగరం త్రివేండ్రం ఉద్రిక్తంగా మారింది.
పీఎఫ్‌ఐ నేతలను విడుదల చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో పోలీసులు చర్యలు ఆగవని చెప్పారు. భవిష్యత్తులో మరింత మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ద్వేషపూరిత ప్రసంగాలకు పిల్లలను ఎలా సిద్ధం చేస్తున్నారో కూడా పోలీసులు ఈ కోణంలో చూస్తున్నారు.