AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udupi: కొత్తగా నిర్మించిన రహదారికి గాడ్సే పేరు.. సైన్‌బోర్డు కలకలం, కేసు న‌మోదు చేసిన పోలీసులు

ఉడిపి జిల్లాలోని ఓ వీధికి నాథూరామ్ గాడ్సే పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ బోర్డు తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో..

Udupi: కొత్తగా నిర్మించిన రహదారికి గాడ్సే పేరు.. సైన్‌బోర్డు కలకలం, కేసు న‌మోదు చేసిన పోలీసులు
Godse
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2022 | 6:41 PM

Share

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని ఓ వీధికి నాథూరామ్ గాడ్సే పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ బోర్డు తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నేతల తరఫు నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఇదిలా ఉంటే, నాథూరాం గాడ్సే పేరు మీద ఎప్పుడు, ఎవరు సైన్ బోర్డు పెట్టారో గ్రామ పంచాయతీకి తెలియడం లేదని పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీవో) తెలిపారు. ఉడిపి జిల్లాలోని బోలా గ్రామ పంచాయితీకి వెళ్లే రహదారిపై ‘నాథూరామ్ గాడ్సే రాస్తా’ అనే సూచిక బోర్డు పెట్టారు. సోమవారం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన గ్రామ పంచాయతీ అధికారులు పోలీసుల సమక్షంలో రోడ్డుపై ఉన్న బోర్డును తొలగించారు. బోర్డు పెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైన్‌బోర్డ్ ఫోటో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది.

సోమవారం ఉదయం రోడ్డుపై నాథూరామ్ గాడ్సే పేరుతో బోర్డులు ఉన్నట్లు సమాచారం అందిందని బోలా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు తెలిపారు. గ్రామపంచాయతీకి సైన్‌బోర్డ్ ఎప్పుడు, ఎవరు ఏర్పాటు చేశారో తెలియదని అన్నారు. గ్రామపంచాయతీ తరపున, ఈ రహదారికి గాడ్సే పేరు పెట్టాలని గ్రామ పంచాయతీ ఎటువంటి ప్రతిపాదన చేయలేదని చెప్పారు. ఫిర్యాదు మేరకు గ్రామపంచాయతీ శాఖ వారు అక్కడికక్కడే కర్కల రూరల్ పోలీసుల సమక్షంలో సైన్ బోర్డును తొలగించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పీడీఓ తెలిపారు. అదే సమయంలో కర్కల తాలూకా పంచాయతీ ద్వారా పదుగిరి గ్రామానికి వెళ్లేందుకు కొంతకాలం క్రితం రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ రహదారిపై సూచిక బోర్డు కనీసం రెండు రోజుల క్రితమే పెట్టినట్టుగా తెసింది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, క‌ర్నాట‌క ఇంధ‌న శాఖ మంత్రి వి సునీల్ కుమార్ నియోజ‌క‌వ‌ర్గంలోని బోలో గ్రామ పంచాయితీలో ఈ సైన్ బోర్డు ఏర్పాటైంది.ఈ బోర్డును ప్రభుత్వం, గ్రామ పంచాయితీ అధికారులు ఏర్పాటు చేయ‌లేద‌ని, ఇది కొంద‌రి దుండగుల ప‌ని అని మంత్రి పేర్కొన్నారు. రెండు రోజుల కింద‌ట తాము ఈ బోర్డును గుర్తించి పంచాయితీ అధికారులు, పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని క‌ర్నాట‌క యూత్ కాంగ్రెస్ చీఫ్ యోగేష్ ఇన తెలిపారు. కొందరు దుండగులు కావాలనే వివాదం రేపేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని, వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Follow Us
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌