AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారికి భారీ విరాళం, టీటీడీ చరిత్రలోనే అత్యధికం..! ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన  భక్తులు కళ్లు చెదిరే రీతిలో భారీగా విరాళం ప్రకటించారు. ఏకంగా రూ.

TTD: శ్రీవారికి భారీ విరాళం, టీటీడీ చరిత్రలోనే అత్యధికం..! ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Ttd
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2022 | 4:53 PM

Share

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి‌వారి ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తులు త‌మ‌కు తోచినంత ఉండీలో వేస్తుంటారు.. మ‌రి కొంద‌రు దాత‌లు విరాళాలు అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన  భక్తులు కళ్లు చెదిరే రీతిలో భారీగా విరాళం ప్రకటించారు. ఏకంగా రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేసి స్వామివారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు. టీటీడీ చరిత్రలో అధిక మొత్తంలో ఒకేరోజు ఇంత భారీగా విరాళం రావ‌డం ఇదే మొద‌టిసారి అని ఆల‌య అధికారులు తెలిపారు.

భారీ విరాళాన్ని తమిళనాడు తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్‌ అనే భక్తుడు రూ. 7 కోట్లు స్వామివారికి సమర్పించుకున్నాడు. అదే విధంగా టీటీడీ నిర్వహణలో ఉన్న అన్నదానం సహ ట్రస్టులకు విరాళం అందజేశారు. ఏ స్టార్‌ టెస్టింగ్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెట్‌ సంస్థ కోటీ విరాళం అందజేసింది. బాలకృష్ణ ఫ్యూయల్‌ స్టేషన్‌ సంస్థ శ్రీవాణి ట్రస్టుకు రూ. కోటీ, సీ హబ్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వీసెస్‌ సంస్థ ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్టుకు రూ. కోటీ విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు దాతలు తిరుమలలో ఈవో ధర్మారెడ్డికి చెక్కులను అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా భయాలు పోవడం, నిబంధనలు సడలించడం, వేసవి సెలవులు దగ్గరపడుతుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. రెండేళ్లుగా స్వామివారిని దర్శించుకోలేకపోయిన వాళ్లు తిరునగరికి పయనమవుతున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనాలను అనుమతిస్తుండడం, కాలినడకన వచ్చే వారి సంఖ్య కూడా పెరగడంతో.. సప్తగిరులు కిక్కిరిసిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి గంటల పాటు భక్తులు వేచిఉండాల్సి వస్తోంది.