- Telugu News Photo Gallery Astro Tips Due to these bad habits you can face financial related problems know in telugu
Astro Tips: ఈ చెడు అలవాట్లు మీకు ఉన్నాయా? తస్మాత్ జాగ్రత్త.. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి ఉన్న కొన్ని అలవాట్లు కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో ఇంట్లో పేదరికం పెరుగుతుంది. మరి ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
Updated on: Jun 06, 2022 | 9:05 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి ఉన్న కొన్ని అలవాట్లు కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో ఇంట్లో పేదరికం పెరుగుతుంది. మరి ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.

ఈడ్చుకుంటూ నడవడం- అంటే చాలా మంది నడిచేటప్పుడు పాదాలను ఈడుస్తున్నట్లుగా నడుస్తారు. పాదాలను నేలకు ఈడుస్తూ నడుస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అలవాటు ఎంతమాత్రం మంచిది కాదు. ఇది వైవాహిక జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. బాంధవ్యంలో విబేధాలు పెరుగుతాయి.

చెల్లాచెదురుగా ఉన్న వంటగది - వంట చేసేటప్పుడు చాలా మంది వంటగదిలో వస్తువులను చెల్లాచెదురుగా పడేస్తుంటారు. కొందరు వాటిని అలాగే వదిలేస్తుంటారు. వంటగది ఇలా ఉండటం.. లక్ష్మీ దేవికి ఏమాత్రం నచ్చదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

గోర్లు నమలడం - చాలా మందికి కూర్చొని గోళ్లను నమలడం అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. ఇలా చేయడం వల్ల తమ గ్రహబలంలో సూర్యుడు బలహీనుడు అవుతాడు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. గౌరవం తక్కువ అవుతుంది.

మురికిగా ఉండటం, శుభ్రత పాటించకపోవడం - పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం. కానీ చాలామంది తమ చుట్టూ మురికిగా ఉంచుకుంటారు. ఇది వారి జీవితంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. ఇది పేదరికానికి కారణం అవుతుంది. కావున మీ చుట్టూ పరిశుభ్రత పాటించండి.





























