Car washes away: లక్ అంటే ఇతనిదే, వాగులో కారు కొట్టుకుపోయిన ప్రాణాలతో బయటపడ్డాడు..

వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో కర్ణాటక వాసి అయిన డాక్టర్‌ జావిద్‌ అన్సారీ మత్యుంజేయుడుగా బయటపడ్డాడు.దానికి కారణం..

Car washes away: లక్ అంటే ఇతనిదే, వాగులో కారు కొట్టుకుపోయిన ప్రాణాలతో బయటపడ్డాడు..
Knl Car
Jyothi Gadda

|

Jun 06, 2022 | 2:45 PM

ఈత…. నిండు ప్రాణాన్ని రక్షించింది. ఏ మాత్రం భయపడకుండా సురక్షితంగా ఒడ్డుకు చేరుకునేలా చేసింది. బ్రతికి ఉండటం అసాధ్యం అని అందరూ అనుకుంటున్న సమయంలో ఏ మాత్రం రక్తపు చుక్క, ఏ చిన్న గాయం లేకుండా అత్యంత సురక్షితంగా ఆ డాక్టర్ బయటపడ్డాడు..దానికి కారణం చిన్నప్పుడు తను నేర్చుకున్న ఈత కారణం. ఎవరా డాక్టర్‌..? అసలేమైందో ఇప్పుడు చూద్దాం..

కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన డాక్టర్ జావిద్ అన్సారీ బెంగళూరు వైదేహి మెడికల్ ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్నాడు. గుల్బర్గాలో పీజీలో అడ్మిషన్ కోసం జూన్‌5న సాయంత్రం బెంగళూరు నుంచి గుల్బర్గా బయలుదేరాడు. రాత్రి 8 గంటల తర్వాత కర్నూలు జిల్లా ఆలూరు దగ్గర కుంభ వర్షం కురిసింది. పదిహేను నిమిషాల్లోనే కల్లి వంక వాగు ఉప్పొంగింది. అదే సమయంలో ఫోర్డ్ ఫిగో కారు లో ఒక్కడే వెళుతూ వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు ఉధృతి బలంగా ఉండటంతో వాగులో కారుతో సహా డాక్టర్ కొట్టుకుపోయారు. ప్రారంభంలో కారు మూడు పల్టీలు కొట్టింది. ఆ తర్వాత నీటిలో సాఫీగా వెళుతున్న సమయంలో ధైర్యం చేసి కారు సన్ ప్రూఫ్ ఓపెన్ చేసాడు. కారుకి సన్ ఫ్రూఫ్ సౌకర్యం లేక పోయి ఉంటే కష్టంగా ఉండేది అని భావిస్తూ ఉన్నారు. ఈత రావడంతో ఈత కొట్టుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. కారు నుంచి కిందికి దూకే సమయంలో సెల్‌ఫోన్‌ మర్చిపోయాడు. కారులోనే ఉండిపోయింది. తెల్లవార్లు ఒడ్డున మేల్కొని ఉన్న డాక్టర్ తెల్లారగానే వరద ఉధృతి తగ్గగానే కారు కోసం ఒంటరిగానే గాలించాడు.

ఇలా గాలిస్తుండగానే 50 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం మరో వంద మంది స్థానికులు వాగులో కారుని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చిన వారికి డాక్టర్ జరిగిన విషయాన్ని చెప్పాడు. ప్రధాన రహదారి నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లగానే కారు కనిపించింది. కారు కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. ఎలా ఉన్నా కారు అలాగే ఉంది. కారులో ఉన్న సెల్ ఫోన్ తో పాటు 80,000 రూపాయలు ఉన్న బ్యాగ్ మిస్ అయ్యాయి. నీళ్లలో ఉన్న కారును తాడు సహాయంతో అందరూ బయటకు లాగారు. ఈత రావడంతో లక్కీగా బయటపడగలిగాను, లేదంటే బ్రతకడం కష్టం అని డాక్టర్ జావేద్ అన్సారీ స్పష్టం చేశారు. వాగు దాటే సమయంలో అందరూ వద్దన్నా కూడా దాటే ప్రయత్నం చేయడం తప్పు అని అంగీకరించారు. కారు పూర్తిగా నీటిలో తడిసిపోవటంతో స్టార్ట్ కావడం లేదు. దీంతో మరో వెహికిల్ లో గుల్బర్గా వెళ్లేందుకు బయల్దేరాడు. హాస్పిటల్ కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడంతో పూర్తి వివరాలు నమోదు చేసుకొన్నారు పోలీసులు. కారు డ్యామేజ్ కాకుండా, తనకు కూడా ఏ చిన్న గాయం కాకుండా సురక్షితం గా బయటపడిన వైనం అందరినీ ఆశ్చర్య పరిచింది. స్థానికులంతా డాక్టర్‌ని మృత్యుంజేయుడు అంటూ ప్రశంసించారు. డాక్టర్ అన్సారీ కూడా అందరికీ థాంక్స్ చెప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో కర్ణాటక వాసి అయిన డాక్టర్‌ జావిద్‌ అన్సారీ మత్యుంజేయుడుగా బయటపడ్డాడు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్లివంక ఉదతంగా ప్రవహించింది. రాత్రి 10:30 గంటల సమయంలో కర్ణాటకకు చెందిన అన్సారీ కారుతో వంకను దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న సిఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ రామనుజులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వెతికిన ప్రయోజనం లేకపోవడంతో ఫైర్‌, ఎన్డిఆర్‌ఎఫ్‌ ఫోర్స్‌ను పిలిపించారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సంఘటన స్థలానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కారు ఉన్నట్లు హతిబెలగల్‌ గ్రామస్థులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. కారులోనే ఉన్న జావిద్‌ను బయటక తీశారు. ఈ సందర్భంగా జావిద్‌ అన్సారీ మాట్లాడుతూ బెంగుళూరు నుంచి ఆలూరు మీదుగా గుల్బర్గాకు వెళ్తునట్లు తెలిపాడు. తనకోసం అహర్నిశలు కష్టపడిన పోలీసులకు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu