Viral News: పానీ పూరి అమ్ముతున్నాడు..కానీ, నీళ్లకు కష్టమంటున్నాడు..! ఒక్క ఫోటోతో ఏకంగా కలెక్టరే స్పందించాడు..

డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి పానీ పూరీ విక్రేత ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో పానీ పూరి అమ్మే వ్యక్తి కనిపిస్తున్నాడు. దీంతో పాటు, అతని..

Viral News: పానీ పూరి అమ్ముతున్నాడు..కానీ, నీళ్లకు కష్టమంటున్నాడు..! ఒక్క ఫోటోతో ఏకంగా కలెక్టరే స్పందించాడు..
Pani Puri Sellers
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2022 | 9:39 AM

ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. నీటిని పొదుపు చేసేందుకు, నీటిని ఎలా పొదుపు చేయాలనే దానిపై ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. నీటి పొదుపుపై ​​ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. నీటిని పొదుపు చేయడం గురించి సోషల్ మీడియాలో విభిన్న పోకడలు,సందేశాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు పానీ పూరీ అమ్మకందారుడు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించాడు. ప్రత్యేక పద్ధతిలో నీటిని పొదుపు చేయాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

పానీపూరీ అమ్మకందారుడు నీటిని పొదుపు చేయాలని పోస్టర్‌పై రాసిన ప్రత్యేక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ వైరల్ పోస్టర్‌ని చూస్తే, నీటి ఆదా కోసం ప్రత్యేకమైన రీతిలో ఇచ్చిన సందేశం మీకు కూడా నచ్చుతుంది. జార్ఖండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో పోస్ట్ చేసిన డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ ఈ ఫోటోను షేర్‌ చేశారు. నీటిని ఆదా చేయడానికి ప్రజలకు సూచించటం కోసం ఎంత సృజనాత్మక మార్గం ఆలోచించాడు అంటూ ఈఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మీరు కూడా ఈ పోస్టర్‌ని చూస్తే, పానీ పూరీ అమ్మకందారు నీటిని పొదుపు చేయమని సందేశం ఇచ్చిన తీరును మీరు మెచ్చుకుంటారు. అయితే, ఈ పానీపూరి విక్రయదారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అతని దుకాణం ఎక్కడ అన్నది మాత్రం సమాచారం లేదు. కానీ నీటి పొదుపుపై ఇచ్చిన ప్రత్యేక సందేశం మాత్రం ప్రజల హృదయాలను గెలుచుకుంది.

డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి పానీ పూరీ విక్రేత ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో పానీ పూరి అమ్మే వ్యక్తి కనిపిస్తున్నాడు. దీంతో పాటు, అతని దగ్గర ఒక బుట్ట కూడా కనిపిస్తుంది. అందులో ఓ పెద్ద పాలిథిన్‌ కవర్‌ నిండా పానీపూరీలు ఉన్నాయి. పానీపూరీ అమ్మకందారుడు బుట్టలో ఉంచిన గోల్గప్పలతో నిండిన పాలిథిన్‌పై పోస్టర్‌ను అంటించాడు. ఈ పోస్టర్‌పై నీటిని కాపాడుకోండి, లేదంటే కొరత తప్పదు అని రాసి ఉంది. ఇప్పుడు నీటి పొదుపు కోసం రాసిన ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.

డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ ఈ పోస్ట్‌ను అనేక మంది రీట్వీట్ చేస్తున్నారు. చాలా మంది లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా యూజర్లు కూడా విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు.

టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్