Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 22ఏళ్ల ఇంగ్లీష్ టీచర్‌కు ఇప్పుడు పదవీ విరమణ,.. 50 ఏళ్ల జ్ఞాపకాలతో వినూత్న వీడ్కోలు..

మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్‌ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్‌వల్​ను ప్లాన్‌ చేస‍్తుంటం. తాజాగా

Viral Video: 22ఏళ్ల ఇంగ్లీష్ టీచర్‌కు ఇప్పుడు పదవీ విరమణ,.. 50 ఏళ్ల జ్ఞాపకాలతో వినూత్న వీడ్కోలు..
Teacher
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2022 | 9:02 AM

మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్‌ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్‌వల్​ను ప్లాన్‌ చేస‍్తుంటం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వైరల్‌గా మారిన ఈ వీడియోలో..ఒక ఇంగ్లీష్‌ టీచర్‌కు స్కూల్‌ మొత్తం వీడ్కోలు పలుకుతున్నారు. 50 ఏళ్లపాటు అదే స్కూల్లో బోధించి పదవీ విరమణ చేసినప్పుడు, పాఠశాల మొత్తం ఆమెకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆదరణ చూసి ఆ టీచర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. వీడ్కోలు క్లిప్‌లో ఉపాధ్యాయురాలు హాల్లోకి ప్రవేశించగానే..ఆ విద్యార్థులు, స్కూల్‌ సిబ్బందితో కలిసి ఆమె కోసం చప్పట్లతో స్వాగతం పలుకుతూ.. ఓ క్రమమైన వరుసలో నడుస్తూ వస్తుంటారు. ఆ దృశ్యాలను నెటిజన్ల మనసుకు హత్తుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

చాలాకాలం పాటు ఒకే ప్రాంతంలో ఉండి, ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోవటం అంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ 50ఏళ్లుగా ఇంగ్లీష్‌ పాఠాలు నేర్పించిన టీచర్‌ పదవీ విమరణ పొందుతున్న క్షణాలు అందరినీ కంటతడి పెట్టించాయి. టీచర్‌ వృత్తిలో ఉన్న వ్యక్తులకు సమాజంలో దొరికే గౌరవం, ప్రేమ, ప్రశంసలు ఎనలేనివి. ఉపాధ్యాయులు ఎందరో భావి తరాలను తీర్చిదిద్దుతూ, మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు. అన్నదానికి ఈ వీడియోనే ఆధారం. కాగా, ఇదంతా వీడియో తీశారు సదరు రిటైర్డ్‌ టీచర్‌ కూతురు. వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చారు..”మా అమ్మ 50 సంవత్సరాలుగా ఈ ఉన్నత పాఠశాలలో బోధించారు, “ఆమె ఇంగ్లీష్ టీచర్‌గా ప్రారంభించినప్పుడు ఆమెకు 22 సంవత్సరాలు. ఈరోజు ఆమెకు చివరి రోజు. ఆమె చివరిసారిగా స్కూల్లోంచి బయటకు వెళ్లడంతో మొత్తం పాఠశాల ఆమెకు వీడ్కోలు పలికింది..అంటూ ఆమె వివరించింది.

50 ఏళ్ల తర్వాత ఆ టీచర్ పదవీ విరమణ చేస్తూ కనిపించిన హృదయాన్ని కదిలించే వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది. ఈ వీడియోను ఆ టీచర్ కుమార్తె ‘కేథరిన్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.