Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagar Kurnool: పెళ్లి వేడుకలో చావు డప్పు.. కూతురి బరాత్‌లో తల్లి డ్యాన్స్‌, అంతలోనే విషాదం

కూతురి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించిన క్షణాల్లోనే తండ్రి మరణించిన దుర్ఘటన ఇటీవల వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన ఇంకా ప్రజలు మరువక ముందే, అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుక కాస్తా ..విషాదంగా మారింది.

Nagar Kurnool: పెళ్లి వేడుకలో చావు డప్పు.. కూతురి బరాత్‌లో తల్లి డ్యాన్స్‌, అంతలోనే విషాదం
Daughters Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2022 | 7:48 AM

కూతురి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించిన క్షణాల్లోనే తండ్రి మరణించిన దుర్ఘటన ఇటీవల వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన ఇంకా ప్రజలు మరువక ముందే, అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుక కాస్తా ..విషాదంగా మారింది. బిడ్డకు పెళ్లి చేసి మెట్టినింటికి సాగనంపే క్రమంలో ఆ తల్లి ఆనందంగా డ్యాన్స్ చేసింది. పెళ్లి బరాత్‌లో ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేసిన ఆ తల్లి అలాగే, కుప్పకూలిపోయింది. అప్పటి వరకు ఆనందోత్సాహంలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. లింగాల మండలంలోని పద్మన్నపల్లి  గ్రామానికి చెందిన మూడవత్‌ విజయలక్ష్మి తన కుమార్తె సంధ్యను అదే మండలానికి చెందిన యంసి తండాకు చెందిన యువకుడికి ఇచ్చి ఘనంగా వివాహం వేడుక జరిపించింది. పెళ్లి కూతురు సంధ్యను అత్తగారింటికి సాగనంపే కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు నిర్వహించారు. కూతురి పెళ్లి బారాత్‌లో డ్యాన్స్‌(Dance‌)చేస్తుండగానే ఆ తల్లి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదిలింది. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు విజయలక్ష్మీని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతురాలు విజయలక్ష్మి గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు.

కూతురి పెళ్లి బరాత్ లో తల్లి మృతిచెందడంతో బంధుమిత్రులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. బాజాభజంత్రీలు మూగబోయాయి. వధువు ఇంట్లో చావు డప్పులు మోగాయి. ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలు విజయలక్ష్మికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని..కేవలం వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురైందని బంధు, మిత్రులు తెలిపారు. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్ని ఎంతగానో కలచివేసింది.

ఆఫ్ సెంచరీ కాగానే కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్
ఆఫ్ సెంచరీ కాగానే కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్
సుశాంత్ మృతి కేసు.. సీబీఐ ఫైనర్ రిపోర్టులో సంచలన విషయాలు
సుశాంత్ మృతి కేసు.. సీబీఐ ఫైనర్ రిపోర్టులో సంచలన విషయాలు
జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల బస్తాలు.. వీడియో రిలీజ్!
జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల బస్తాలు.. వీడియో రిలీజ్!
నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం? ఫడ్నవీస్‌ ఏమన్నారంటే..
నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం? ఫడ్నవీస్‌ ఏమన్నారంటే..
సినిమాలు డిజాస్టర్ అయినా కోట్ల ఆస్తి కూడబెట్టిన బ్యూటీ ఎవరంటే?
సినిమాలు డిజాస్టర్ అయినా కోట్ల ఆస్తి కూడబెట్టిన బ్యూటీ ఎవరంటే?
కెకెఆర్‌కు అన్యాయం చేసిన అంపైర్లు?
కెకెఆర్‌కు అన్యాయం చేసిన అంపైర్లు?
అప్పుడే ఓటీటీలోకి సందీప్ కిషన్ 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి సందీప్ కిషన్ 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏపీలో కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచి అంటే..?
ఏపీలో కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచి అంటే..?
పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు: కేసీఆర్
పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు: కేసీఆర్
ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 83% మంది నిరుద్యోగులుగానే.. నివేదిక
ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 83% మంది నిరుద్యోగులుగానే.. నివేదిక