Traffic Police: ఫుడ్‌డెలివరీ బాయ్‌ చెంప చెల్లుమనిపించిన కానిస్టేబుల్‌.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!

ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తిని పోలీసు రెండుసార్లు చెంప పగులగొట్టాడు. రద్దీగా ఉండే రోడ్డులో ఫుడ్‌డెలివరీ చేసే వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

Traffic Police: ఫుడ్‌డెలివరీ బాయ్‌ చెంప చెల్లుమనిపించిన కానిస్టేబుల్‌.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!
Traffic Police
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2022 | 11:08 AM

ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తిని పోలీసు రెండుసార్లు చెంప పగులగొట్టాడు. రద్దీగా ఉండే రోడ్డులో ఫుడ్‌డెలివరీ చేసే వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కోయంబత్తూర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు బదిలీ చేయబడ్డాడు.

సింగనల్లూరు పోలీస్‌ స్టేషన్‌కు చెందిన గ్రేడ్‌-1 కానిస్టేబుల్‌ సతీష్‌ శుక్రవారం అవినాశి రోడ్డులోని ట్రాఫిక్‌ జంక్షన్‌ వద్ద ఫుడ్‌ డెలివరీ చేసే వ్యక్తిని చెంపపగుల కొట్టాడు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీస్‌ ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌ని కంట్రోల్‌ రూమ్‌కు తరలించారు. 38ఏళ్ల మోహన సుందరం గత రెండేళ్లుగా ఫుడ్‌ అగ్రిగేటర్‌ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మొన్నటి శుక్రవారం రోజున సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు మోహనసుందరం గమనించాడు. రద్దీగా ఉండే రోడ్డులో ఉన్న మాల్ సమీపంలో బస్సు రెండు ద్విచక్ర వాహనాలను, బాటసారులను ఢీకొట్టబోతుంది. దాంతో అతడు ఆ బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించడంతో కొంతసేపు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న సమీపంలోని ట్రాఫిక్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి వచ్చి మోహనసుందరాన్ని చెంపపై కొట్టాడు. ఇదంతా సమీపంలోని కొందరు వీడియోలు తీశారు.

ఇవి కూడా చదవండి

ప్రయాణికులు రికార్డ్ చేసిన వీడియో ప్రకారం, ట్రాఫిక్ పోలీసు ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తిని బూతులు తిడుతూ..రెండుసార్లు చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. మోటార్ సైకిల్‌ను పాడు చేస్తూ అతని మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కున్నారు. స్కూలు బస్సు ఎవరిదో తెలుసా అంటూ..కానిస్టేబుల్‌ సతీష్, మోహనసుందరాన్ని బెదిరించారు. వాహనాల రాకపోకలకు ఏమైనా సమస్యలు తలెత్తితే అది పోలీసులు చూసుకుంటారు. అదంతా నీకెందుకంటూ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు.

మోహనసుందరం శనివారం నగర పోలీసు కమిషనర్‌ అధికారిని కలిసి జరిగిన విషయమై ఫిర్యాదు చేశాడు. దాంతో అధికారులు సతీష్‌ను కంట్రోల్‌ రూమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.