Purohit Fighting: గుడిలో పొట్టు పొట్టు కొట్టుకున్న పూజారులు.. అసలుఏం జరిగిందంటే..?
దక్షిణ కోసం ఇద్దరు పూజారులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయం లో చోటుచేసుకుంది. ఈ ఘటన 23వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దక్షిణ కోసం ఇద్దరు పూజారులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయం లో చోటుచేసుకుంది. ఈ ఘటన 23వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేళ్లచెరువు శివాలయ ప్రధాన అర్చకుడు విష్ణువర్ధన్ శర్మ ఆదేశాల మేరకు నరసింహ అనే తాత్కాలిక పూజారి వాహన పూజ నిర్వహించారు…. పూజానంతరం భక్తులు ఆయనకు దక్షిణ సమర్పించారు… వాహన పూజ చేసిన సందర్భంగా తీసుకున్న దక్షిణ తనకూ ఇవ్వాలని అమ్మవారి ఆలయ జూనియర్ ధనుంజయ శర్మ నరసింహను అడిగాడు. దీంతో ప్రధాన అర్చకుడిని అడిగి ఆ డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది… వాగ్వాదం జరుగుతున్న క్రమంలోనే ధనంజయ శర్మ నరసింహ పై దాడికి పాల్పడ్డాడు. విచక్షణా రహితంగా చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు సీరియస్‌గా స్పందించారు దాడికి పాల్పడ్డ పూజారికి మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!