AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: ఈ పెళ్లి కూతురి లెహంగా వెరీ స్పెషల్‌.. ప్రియమైనవారి సంతకాలను తనలో దాచుకుంటుంది..!

సోషల్ మీడియా పరిధి పెరగడంతో ఇటీవల వధూవరులకు సంబంధించిన వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వీడియో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి కూతురు ధరించిన లెహంగా ప్రత్యేకమైంది.

Trending: ఈ పెళ్లి కూతురి లెహంగా వెరీ స్పెషల్‌.. ప్రియమైనవారి సంతకాలను తనలో దాచుకుంటుంది..!
Bride S Lehenga
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2022 | 3:44 PM

Share

సోషల్ మీడియా పరిధి పెరగడంతో ఇటీవల వధూవరులకు సంబంధించిన వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వీడియో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకి సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయ్యారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి కూతురు ధరించిన లెహంగా ప్రత్యేకమైంది. ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు అంటే పెళ్లీపేరంటాలకు సంబంధించీ ఎన్నో కలలుంటాయి. ఆయా సందర్భాల్లో ఏ చీర కట్టుకోవాలి.. దానికి తగినట్టుగా ఎలాంటి నగలు పెట్టుకోవాలి వగైరా వగైరా. ముఖ్యంగా పెళ్లి సమయంలో అమ్మాయిల డ్రస్సులు మరింత స్పెషల్‌ అట్రాక్షన్‌ ఉండేలా తయారు చేయించుకుంటారు. అలాగే ఈ నవ వధువు సైతం తన లెహంగాను ఎంతో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది. దానికి బంధుమిత్రులు సైతం అవాక్కయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

గతంలో పెళ్లి అంటేనే, వధువు సిగ్గుపడేది. పెళ్లి పందిరిలోకి సిగ్గుతో తలవంచుకుని ఉండేది. అయితే మారుతున్న జనరేషన్ వచ్చిన అన్ని మార్పుల్లో భాగంగా ఇపుడు పెళ్లి వేడుకసమయంలో పెళ్లి కూతురు తన పెళ్లి ఎప్పటికీ గుర్తుకు వచ్చే విధంగా కొన్ని జ్ఞాపకాలను పొందుపరుచుకుంటున్నారు. తన పెళ్లి రోజు అనేది తనతో పాటుగా తన అమ్మనాన్నలు, తోబుట్టువులకు ప్రత్యేక రోజుగా గుర్తుండిపోయేలా చేసింది. అందుకోసం ఈ వధువు తన ప్రియమైనవారి సంతకాలను లెంహంగా అంచున భద్రంగా దాచుకుంటోంది. స్కూల్‌ డేస్‌, కాలేజీ రోజుల్లో స్లామ్‌ బుక్ రాసుకున్నట్టుగా ఆమె తన లెహంగా అంచున ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేయించుకుంది. వధువు సోదరుడు, తల్లిదండ్రులు, ఆమె ప్రియమైన వారి సంతకాలను దాచుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వివాహ లెహంగాపై వారంతా సంతకం చేశారు.

ఇవి కూడా చదవండి

సిమ్రాన్ బలార్ ఖబియా జైన్ అనే వధువు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో ఎంతో మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. సిమ్రాన్ తన పెళ్లి రోజు, తన ప్రియమైనవారి సంతకాలను తీపి గుర్తులుగా కాపాడుకోవాలని భావించి ఇలా సరికొత్త ప్రయత్నం చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, TEDx స్పీకర్ అయిన సిమ్రాన్ బలార్ ఖబియా జైన్ అనే వధువు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోని షేర్ చేసింది. సిమ్రాన్‌ 7.86 లక్షల మంది ఫాలోవర్లను కలిగింది. ఈ లైఫ్ స్టైల్ బ్లాగర్ ఆరోగ్యం నుండి ఫైనాన్స్ వరకు అనేక అంశాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఈక్రమంలోనే ఆమె పెళ్లికి సంబంధించిన ఈ అద్భుతమైన వీడియోని కూడా షేర్‌ చేసింది.

వీడియో షేర్ చేసిన కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ ప్రత్యేకమైన వివాహ లెహంగాపై 3.9 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. లైకులు, షేర్లతో హోరెత్తించారు. ఈ అందమైన ఆలోనచను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదోక “మెస్మరైజింగ్, మీరు ఎప్పటికీ ఆదరించే అందమైన క్షణాలను మీకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తుంది” అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి