Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITBP- Indo-Tibetan Border Police: 22 వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ జవాన్ల సాహసం

ఇండియా, టిబెట్ సరిహద్దులో పహారా కాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైనది ఐటీబీపీ దళం. భారత రక్షణ దళాల్లో ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. తాజాగా ఐటీబీపీ దళం అరుదైన రికార్డును సృష్టించారు..

ITBP- Indo-Tibetan Border Police: 22 వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ జవాన్ల సాహసం
Itbp Police
Follow us
Jyothi Gadda

| Edited By: Shiva Prajapati

Updated on: Jun 06, 2022 | 6:24 PM

ఉత్తరాఖండ్‌లోని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు ((ITBP- Indo-Tibetan Border Police) అరుదైన రికార్డు సృష్టించారు. హిమాల‌యాల్లో 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారు. ఐటీబీపీలో ప‌ర్వతారోహ‌కులుగా ఉన్న సిబ్బంది ఈ ఘ‌న‌త‌ను సాధించారు. మంచు అధికంగా ఉన్నా.. ఐటీబీపీ ద‌ళాలు మాత్రం యోగా క్రియ‌ల‌ను నిర్విఘ్నంగా నిర్వహించారు. ఇటీల ఐటీబీపీ ప‌ర్వతారోహ‌కులు మౌంట్ అబి గామిన్ ప‌ర్వతంపై కూడా యోగా చేశారు. 14 మంది స‌భ్యులున్న బృందం సుమారు 20 నిమిషాల పాటు ఈ యోగా చేశారు. యోగా చేసే సమయంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో కప్పి ఉంది. ఎత్తైన పర్వతంపై మంచులో నిలబడి ‘బద్రి విశాల్ కీ జై’ అని నినాదాలతో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అబి గామిన్ పర్వతం సెంట్రల్ హిమాలయాలలోని జస్కర్ రేంజ్‌లో ఉంటుంది. అబి గామెన్ ఈ ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద పర్వతం.

ఇండియా, టిబెట్ సరిహద్దులో పహారా కాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైనది ఐటీబీపీ దళం. భారత రక్షణ దళాల్లో ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. ఈ విభాగంలో దాదాపు 90,000 మందికి పైగా జవాన్లు, అధికారులు పని చేస్తున్నారు. నక్సల్స్(Naxals) ప్రభావిత ప్రాంతాల్లో మోహరింపు, శాంతిభద్రతల పరిరక్షణ విధులతోపాటు హిమాలయ సరిహద్దులను రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ ఈ దళంలో ఉంటారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదకర, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. ఎక్కువగా హిమాలయాలలో 3,000 నుంచి 18,800 అడుగుల ఎత్తులో సరిహద్దు రక్షణ విధులు నిర్వర్తిస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత -45 డిగ్రీల వరకు పడిపోతుంది.రు. దాదాపు 230 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ దళానికి పర్వతారోహణలోనూ మంచి పట్టు ఉంటుంది.

Koo App

आईटीबीपी द्वारा हाई एल्टीट्यूड पर योगाभ्यास का नया रिकॉर्ड। आईटीबीपी के पर्वतारोहियों ने 8वें अंतर्राष्ट्रीय योग दिवस से पहले इसकी थीम: ’मानवता के लिए योग’ के साथ उत्तराखंड में माउंट अबी गामिन के पास 22,850 फीट की ऊंचाई पर योगाभ्यास करके अनूठा कीर्तिमान स्थापित किया है। #IYD2022

Indo-Tibetan Border Police (ITBP) (@ITBP_Official) 6 June 2022

నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పతంజలి పరిశోధన.. వెలుగులోకి కీలక అంశాలు
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పతంజలి పరిశోధన.. వెలుగులోకి కీలక అంశాలు
ఈ కాంత స్పర్శతో శిల వజ్రంగా మారుతుందేమో.. గార్జియస్ మృణాళిని..
ఈ కాంత స్పర్శతో శిల వజ్రంగా మారుతుందేమో.. గార్జియస్ మృణాళిని..
దండు పాళ్యం సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?లేటెస్ట్ ఫొటోస్
దండు పాళ్యం సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?లేటెస్ట్ ఫొటోస్
ధోనీకి ఈ మ్యాచ్ ఎప్పటికి గుర్తిండిపోవడం ఖాయం!
ధోనీకి ఈ మ్యాచ్ ఎప్పటికి గుర్తిండిపోవడం ఖాయం!
యంగ్ బ్యూటీ దీపికా పిల్లి క్రేజీ ఫొటోస్..
యంగ్ బ్యూటీ దీపికా పిల్లి క్రేజీ ఫొటోస్..
అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. ఇక్కడ 10G బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు!
అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. ఇక్కడ 10G బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు!
కేరళ అంటే మున్నార్, తెక్కడినే కాదు..కల్పెట్టా కూడా మస్తుగుంటది..!
కేరళ అంటే మున్నార్, తెక్కడినే కాదు..కల్పెట్టా కూడా మస్తుగుంటది..!