AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon River: ఈ నది 9 దేశాల్లో ప్రవహిస్తుంది.. ఇప్పటి వరకూ ఒక వంతెన కూడా నిర్మించలేదు.. రీజన్ ఏమిటో తెలుసా..

ప్రపంచంలోని రెండవ పొడవైన నది అని పిలువబడే ఈ నది పొడవు 6400 కిమీ కంటే ఎక్కువ .. ఈ నది తొమ్మిది దేశాలలో ప్రవహిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క వంతెన కూడా ఈ నది మీద నిర్మాణం జరగలేదు.. అవును ఆ నది అమెజాన్ నది.

Amazon River: ఈ నది 9 దేశాల్లో ప్రవహిస్తుంది.. ఇప్పటి వరకూ ఒక వంతెన కూడా నిర్మించలేదు.. రీజన్ ఏమిటో తెలుసా..
Amazon River
Surya Kala
|

Updated on: Jun 06, 2022 | 1:59 PM

Share

Amazon River: ఏదైనా నదికి దాని ప్రవాహం, దాని విశాలమైన ఒడ్డు.. ప్రవహించే తీరం పోరాడవు బట్టి గుర్తింపు లభిస్తుంది. నదులు జీవజాతులు ప్రకృతి ప్రసాదించిన వరం. అయితే అతి పెద్ద నది కూడా చాలా చిన్న ప్రవాహంతో మొదలవుతుంది. తన ప్రవాహంలో.. కొండలు, కోనలను దాటుకుంటూ.. గమ్యస్థానికి చేరుకుంటాయి.. అయితే ప్రపంచంలో కొన్ని జీవనదులున్నాయి. ఈ నదుల్లో ఏడాది పొడవునా నీటి ప్రవాహం ఉంటుంది. వర్షాలు కురిసే సమయంతో పాటు, వర్షం పడటం ఆగిపోయినప్పుడు.. వేసవిలో మంచు కరుగడం వలన ఇలా నిరంతరం నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈరోజు ప్రపంచంలో ఓ గొప్ప నది గురించి తెలుసుకుందాం.. ప్రపంచంలోని రెండవ పొడవైన నది అని పిలువబడే ఈ నది పొడవు 6400 కిమీ కంటే ఎక్కువ ..  ఈ నది తొమ్మిది దేశాలలో ప్రవహిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క వంతెన కూడా ఈ నది మీద నిర్మాణం జరగలేదు.. అవును ఆ నది అమెజాన్ నది.

9 దేశాల్లో ప్రవాహం:  ప్రపంచంలోనే అతి పొడవైన నది గురించి మాట్లాడినప్పుడల్లా నైలు నది గుర్తుకు వస్తుంది. కానీ మంచినీటి విషయానికి వస్తే, మొదటి పేరు అమెజాన్ నది. ఈ నదిలో అనేక రకాల జీవులు నివసిస్తాయి. ఈ మంచి నీటి నదిలో భారీ సంఖ్యలో డాల్ఫిన్లు కనిపిస్తాయి. ఈ నది దక్షిణ అమెరికాలో 40 శాతం విస్తరించి తొమ్మిది దేశాలను తాకుతూ ప్రవహిస్తుంది. అంటే   ఈ నది బొలీవియా, బ్రెజిల్, పెరూ, కొలంబియా, ఈక్వెడార్, వెనిజులా, ఫ్రెంచ్ గయానా, గయానా, సురినామ్ మొదలైన దేశాలను తాకుతూ ప్రవహిస్తుంది.

ఎందుకు వంతెన నిర్మించలేదంటే:  దీనికి  స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ఛైర్‌పర్సన్ వాల్టర్ కౌఫ్‌మాన్..  లైవ్ సైన్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిస్తూ.. నది ఎక్కడ మొదలవుతుందో.. ఆ నది ప్రవహించే మార్గాల్లో ఎక్కడికి వెళుతుందో అక్కడ వంతెన అవసరమని చెప్పారు. ఎందుకంటే నది ప్రవహించే ప్రదేశంలో జనాభా చాలా తక్కువగా ఉంది. అంతేకాదు ఈ నది ప్రవహిస్తున్న ఈ నగరాల్లో నివసించే ప్రజలకు నదిని దాటడానికి వంతెన కూడా అవసరం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

వాల్టర్ కౌఫ్‌మన్ .. మాట్లాడుతూ, ఈ నది ఒడ్డున ఉన్న మట్టి చాలా మృదువైనది. కనుక ఇక్కడ వంతెన నిర్మిస్తే, చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఈ దేశాల్లోని ప్రభుత్వాలు బ్రిడ్జి కట్టాలంటే ఆసక్తిని చూపించావు.. పైగా అమెజాన్ నది తీరంలో నివాసించే ప్రజలు కూడా తమకు నది దాటడానికి వంతెన కావాలని ఎన్నడూ కోరలేదు.. కనుక  ప్రజలకు అవసరం లేకుంటే.. అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకని ప్రభుత్వాలు భావిస్తున్నాయని తెలిపారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..