Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చింపిరి జుట్టుతో బయటకు వెళ్తున్నారా.? అయితే జాగ్రత్త! ఇక్కడ ఏమైందో తెలిస్తే షాక్‌ అవుతారు..

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కనిపించిన ప్రతి వీడియోలోనూ ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. అవి కచ్చితంగా నెటిజన్లకు నచ్చుతుంటాయి. తాజాగా మరో విచిత్రమైన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

Viral Video: చింపిరి జుట్టుతో బయటకు వెళ్తున్నారా.? అయితే జాగ్రత్త! ఇక్కడ ఏమైందో తెలిస్తే షాక్‌ అవుతారు..
Woodpecker
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2022 | 12:47 PM

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కనిపించిన ప్రతి వీడియోలోనూ ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. అవి కచ్చితంగా నెటిజన్లకు నచ్చుతుంటాయి. తాజాగా మరో విచిత్రమైన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. అందులో ఓ మహిళ జుట్టులోకి దూరిన వండ్రంగి పిట్ట ఆ యువతిని ముప్పుతిప్పలు పెట్టింది. ఆఖరుకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

అందుకే అంటారు ఆడవారు జుట్టును విరబోసుకోవద్దని. వెంట్రులు నున్నగా దూసి ముడివేయాలి. లేదంటే జడ వేసుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. అలా పెద్దల మాట వినని వారికి ఏం జరుగుతుందో తెలియజేసే అనేక సంఘటనలు గతంలోనూ మనం చూశాం..ఇక ఇక్కడ కూడా అలాంటి సీనే ఒకటి కనిపించింది. చింపిరి జుట్టుతో ఉన్న ఓ మహిళ జుట్టులోకి దూరింది వడ్రంగి పిట్ట. దాని కాళ్ల గోర్లు ఆమె జుట్టులోకి దూసుకుపోవటంతో ఆమె తీవ్రమైన తలనొప్పితో బాధపడాల్సి వచ్చింది. తలపై పక్షి ఇరుక్కుపోవటంతో ఆమె దాంతోపాటుగానే ఇంట్లోకి వెళ్లింది..గట్టిగా అరుస్తూ..ఏడుస్తూ ఇంటి సభ్యులను పిలిచింది. అంతలో వచ్చిన ఆమె సోదరుడు జరిగింది గమనించాడు. మెళ్లిగా పక్షిని ఆమె జుట్టులోంచి విడిచిపించే ప్రయత్నం చేశాడు. ఫుడ్‌ పీకర్‌ కాలి గోర్లు ఆమె జుట్టులో ఇరుక్కుపోవటంతో సున్నితంగా విడిపించాల్సి వచ్చింది. అతడు జాగ్రత్తగా పక్షిని బయటకు తీస్తున్న దృశ్యాలు మనం వీడియోలో చూడొచ్చు..ఎట్టకేలకు ప్రయత్నించి జుట్టులో ఇరుక్కుపోయిన వడ్రంగి పిట్టను విడిపించి పక్కకు వదిలిపెట్టాడు. అయితే, ఆ పక్షి ఆ యువతికి ఎలాంటి హానీ చేయలేదు. ఎందుకంటే ఆమె తన రెండు చేతులతో కళ్లు, ముఖం కనిపించకుండా పూర్తిగా కప్పేసుకుంది.

‘వుడీ ది వుడ్‌పెకర్’ కార్టూన్‌తో పోల్చిన ఈ వీడియో టిక్‌టాక్‌లో వైరల్ అయ్యింది.వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి