అమెరికా అధ్యక్షుడిని భయపెట్టిన ఆ విమానం..! భద్రత బలగాలు అప్రమ్తతం, బైడెన్‌తో పాటు ప్రథమ పౌరురాలు తరలింపు

అమెరికా అధ‍్యక్షుడు జో బైడెన్‌ నివాసం వద్ద గుర్తు తెలియని చక్కర్లు కొట్టింది. దాంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనపై వైట్‌ హౌస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

అమెరికా అధ్యక్షుడిని భయపెట్టిన ఆ విమానం..! భద్రత బలగాలు అప్రమ్తతం, బైడెన్‌తో పాటు ప్రథమ పౌరురాలు తరలింపు
Joe Biden
Jyothi Gadda

|

Jun 05, 2022 | 11:38 AM

అమెరికా అధ‍్యక్షుడు జో బైడెన్‌ నివాసం వద్ద ఓ విమానం కలకలం సృష్టించింది. బైడెన్‌ నివాసంపై గుర్తుతెలియని విమానం చక్కర్లు కొట్టినట్లు తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు జో బైడెన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అసలు ఇంతకు అక్కడ ఏం జరిగింది. వైట్‌ హౌస్‌ అధికారులు ఏం చెబుతున్నారు..పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికా అధ‍్యక్షుడు జో బైడెన్‌ నివాసం వద్ద గుర్తు తెలియని చక్కర్లు కొట్టింది. దాంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనపై వైట్‌ హౌస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఒక చిన్న విమానం అమెరికా అధ్యక్షుడికి చెందిన రెహోబోత్ బీచ్ హోమ్ ప్రాంతం అంటే.. వాషింగ్టన్‌కు 200 కి.మీ దూరంలో గగనతలంలోకి ప్రవేశించింది. నో-ఫ్లై జోన్‌లోకి విమానం రావడంతో ఒక్కసారిగా భద్రతా సిబ‍్బంది అలర్ట్‌ అయ్యారు. దీంతో, ముందు జాగ్రత్త చర్యగా అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌, ప్రథ‌మ పౌరురాలు జిల్‌ బైడెన్‌ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, ప్రెసిడెంట్‌ను రక్షించే బాధ్యతను స్వీకరించిన సీక్రెట్ సర్వీస్ విమానం.. పొరపాటున సురక్షిత ప్రాంతంలోకి ప్రవేశించిందని చెప్పారు. సమాచారం అందించిన వెంటనే విమానం బయటకు వెళ్లినట్టు స్పష్టం చేశారు. కాగా, ప్రెసిడెంట్, ఆయ‌న కుటుంబానికి ఎలాంటి ముప్పులేదని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మీ చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu