Tamil Nadu: ఇంటిముందు పార్క్ చేసిన కారులో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు.. అంతలోనే డోర్లు లాక్, తీరా చూస్తే.. !

ఇంటిముందు పార్క్ చేసిన కారులో ఆడుకుంటూ ముగ్గురు చిన్నారులు కారులో చిక్కుకున్నారు. కారు లాక్ అయిపోవడంతో.. వారు అందులోనే ఉండిపోయారు. ఈ క్రమంలో నే చిన్నారులు..

Tamil Nadu: ఇంటిముందు పార్క్ చేసిన కారులో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు.. అంతలోనే డోర్లు లాక్,  తీరా చూస్తే.. !
Tn Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2022 | 11:48 AM

కారులో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో చోటుచేసుకుంది. ఆడుకుంటూ కారులో చిన్నారులు చిక్కుకున్నారు. కారు లాక్ అయిపోవడంతో.. వారు అందులోనే ఉండిపోయారు. ఈ క్రమంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలిలో ఈ విషాద దుర్ఘటన చోటు చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన మనికందన్‌ అనే వ్యక్తి బయట కారు పార్క్‌ చేశాడు. ఈ క్రమంలోనే ముగ్గురు చిన్నారులు కారులోకి ఎక్కారు. చిన్నారులు కారు ఎక్కడాన్ని ఎవరూ గమనించలేదు. ఈ క్రమంలోనే కారు లోపలి నుంచి లాక్‌ అయిపోయింది. పనంగుడి సమీపంలోని లెప్పాయ్​ అపార్ట్​మెంట్​లో నివాసం ఉండే నాగరాజన్​ కుమారుడు నితీశ్​(5), నితీశ(7), అదే అపార్ట్​మెంట్​లో ఉండే మరోవ్యక్తి సుధాకర్​ కుమారుడు కబిసాంత్​(4) కారులో ఉండిపోయారు. చిన్నారులు కారు డోర్లు తెరిచేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చుట్టు పక్కల కూడా ఎవరూ లేకపోవడంతో ఘోరం జరిగిపోయింది. చివరి నిమిషంలో చూసి కుటుంబీకులు పిల్లల్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే చిన్నారులు ముగ్గురు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. కారులో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తేల్చిచెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.