AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Queen Elizabeth II: ఎలిజబెత్‌ రాణి బ్యాగులో ఏముంటుందో తెలిస్తే షాక్‌ అవుతారు..!

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II 70 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భంలో నాలుగు రోజుల ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఆదివారం మూడవ రోజు, ప్రిన్స్ చార్లెస్, అతని కుమారుడు ప్రిన్స్ విలియం రాణిని సత్కరించారు. ఈ సమయంలో,

Queen Elizabeth II: ఎలిజబెత్‌ రాణి బ్యాగులో ఏముంటుందో తెలిస్తే షాక్‌ అవుతారు..!
Queen Elizabeth
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2022 | 8:21 PM

Share

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II 70 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భంలో నాలుగు రోజుల ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఆదివారం మూడవ రోజు, ప్రిన్స్ చార్లెస్, అతని కుమారుడు ప్రిన్స్ విలియం రాణిని సత్కరించారు. ఈ సమయంలో, ప్యాలెస్ వేడుకల్లో దాదాపు 22,000 మంది ప్రజలు పార్టీలో పాల్గొన్నారు. వీరికి ముందు డయానా రాస్, రాక్ బ్యాండ్ క్వీన్, డురాన్ డురాన్, అలిసియా కీస్, ఇతర ప్రసిద్ధ కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ఎలిజబెత్‌ రాణి ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ఆమె ఓ వీడియోలో నటించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. ప్రముఖ ఫిక్షనల్‌ క్యారెక్టర్‌ పాడింగ్టన్‌ బేర్‌ యానిమేటెడ్‌ వీడియోలో రాణి ఎలిజబెత్‌ చాలా సరదగా కన్పించారు. అందులో వారి సన్నివేశం మరింత ఆసక్తిగా సాగింది.

పాడింగ్టన్ బేర్‌, ఎలిజబెత్‌ రాణితో కలిసి టీ పార్టీలో కూర్చుని ఉన్నారు. బేర్‌.. రాణి ఎలిజబెత్‌కు టీ సర్వ్‌ చేస్తూ ‘‘మీకు మర్మలేడ్‌ శాండ్‌ విచ్‌ అంటే చాలా ఇష్టం కదా..! అందుకోసం..కోసమని నేను ఎప్పుడూ ఒకటి వెంట ఉంచుకుంటాను అంటూ తన టోపీలో నుంచి ఒక శాండ్‌విచ్‌ బయటకు తీస్తుంది. ఆ వెంటనే ఎలిజబెత్‌ రాణి స్పందిస్తూ..నేను కూడా.. ఎప్పుడూ ఒకటి వెంట ఉంచుకుంటాను అని నవ్వుతూ బ్యాగులో నుంచి శాండ్‌విచ్‌ను బయటకు తీస్తారు. అది చూసిన బేర్‌ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక అంతలోనే, జూబ్లీ వేడుకలు మొదలయ్యాయంటూ ఓ వ్యక్తి రాణికి చెబుతారు. ఆ తర్వాత బేర్‌.. ‘‘హ్యాపీ జూబ్లీ మేజెస్టీ.. థాంక్యూ ఫర్‌ ఎవ్రీ థింగ్‌’’ అంటూ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ది రాయల్‌ ఫ్యామిలీ తమ యూట్యూబ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా.. 24 గంటల్లోనే 30లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది.

ఇవి కూడా చదవండి

నాలుగు రోజుల పాటు సాగిన ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు రాణి ఎలిజబెత్‌ కుటుంబ సభ్యులతో కలిసి బాల్కనీ నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ వేడుకల్లో ప్రిన్స్‌ విలియమ్‌ – కేట్‌ దంపతుల పిల్లలు ప్రత్యేకార్షణగా నిలిచారు. ముఖ్యంగా కేట్‌ చిన్న కుమారుడు ప్రిన్స్ లూయిస్‌ తన చిలిపి అల్లరితో సందడి చేశాడు. ప్లాటినం జూబ్లీ వేడుకల చివరి రోజున ఘనంగా వీధి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్ట్‌మింటర్ అబ్బే చర్చి నుండి బకింగ్‌హామ్ ప్యాలెస్ వరకు 200 గుర్రాలతో కూడిన భారీ కవాతును తీసుకెళ్లారు. ఈ కవాతులో, బ్రిటన్ రాణి యొక్క అదే గొప్ప రథాన్ని చేర్చారు, దీనిని 69 సంవత్సరాల క్రితం పట్టాభిషేకం సమయంలో రాణి ఉపయోగించారు. ఈ సందర్భంగా ఆమె పట్టాభిషేకానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.