AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: మంత్రాల నెపంతో దారుణం, వ్యక్తిని బండరాళ్లతో కొట్టి, పెట్రోల్‌ పోసి తగులబెట్టారు..

మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను తీస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని అతి దారుణంగా రాళ్లతో కొట్టి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అందరూ..

Black Magic: మంత్రాల నెపంతో దారుణం, వ్యక్తిని బండరాళ్లతో కొట్టి, పెట్రోల్‌ పోసి తగులబెట్టారు..
Nzb
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2022 | 5:50 PM

Share

ఓ వైపు ప్రపంచం శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతోంది. అందివచ్చిన టెక్నాలజీ సాయంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. అనేక విజయాలతో ఆధునిక పోకడలను అనుసరిస్తుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను తీస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని అతి దారుణంగా రాళ్లతో కొట్టి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరగడం గమనార్హం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది…హత్య కాబడిన వ్యక్తి ఇరోళ్ల మల్లయ్య (62) గా గుర్తించారు. ఈ మేరకు పోలిసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. భాదితుల కథనం మేరకు పూర్తి వివరాలు పరిశీలించగా…

బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఇరోల్ల మల్లయ్య- నర్సవ్వలు ఇద్దరు దంపతులు.. ఉన్న ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. కుమారుడు గత కొన్ని సంవత్సరాలుగా బ్రతుకు దేరువు నిమిత్తం హైదరాబాదులో జీవిస్తున్నాడు.ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మల్లయ్యను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి బండరాళ్లతో చితకబాదారు. అనంతరం పెట్రోల్‌ పోసి తగులబెట్టారు అదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు. దాంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దుండగులు మృతుని భార్య పై కూడా దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న కామారెడ్డి డీఎస్పీ సోమనాథం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బీబీపేట పోలీసులు. జరిగిన దారుణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి