Elon musk: అలా చేయకుంటే డీల్ రద్దు చేసుకుంటా.. ట్విట్టర్‌ను హెచ్చరించిన ఎలోన్ మస్క్..
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌తో ఒప్పందాన్ని త్వరగా ముగించాలని కోరాడు. రాయిటర్స్ ప్రకారం, సోషల్ మీడియా నెట్‌వర్క్ స్పామ్, నకిలీ ఖాతాలపై డేటాను అందించకపోతే, ట్విట్టర్ ఇంక్‌ని కొనుగోలు చేయడానికి చేసుకున్న 44 బిలియన్ డాలర్ల డీల్‌ను రద్దు చేసుకుంటానని హెచ్చరించాడు...
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌తో ఒప్పందాన్ని త్వరగా ముగించాలని కోరాడు. రాయిటర్స్ ప్రకారం, సోషల్ మీడియా నెట్‌వర్క్ స్పామ్, నకిలీ ఖాతాలపై డేటాను అందించకపోతే, ట్విట్టర్ ఇంక్‌ని కొనుగోలు చేయడానికి చేసుకున్న 44 బిలియన్ డాలర్ల డీల్‌ను రద్దు చేసుకుంటానని హెచ్చరించాడు. ఏప్రిల్‌లో మస్క్ ట్విట్టర్‌ను $ 44 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ యొక్క మొత్తం యూజర్‌బేస్‌లో స్పామ్ లేదా ఫేక్ ఖాతాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించే వరకు ఈ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మే నెలలో మస్క్ చెప్పారు. ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారుల నుంచి 50 వేల కోట్ల రూపాయలకు పైగా సేకరించడంలో మస్క్ విజయవంతమయ్యాడు. ఈ ఫండ్ మొత్తం 19 మంది పెట్టుబడిదారుల నుంచి సేకరించాడు. మస్క్ పెట్టుబడి ప్రతిపాదనలో భాగమైన పెట్టుబడిదారులలో ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కూడా ఉన్నారు. అదనంగా, సౌదీ క్రౌన్ ప్రిన్స్ అల్వలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్సౌద్ మస్క్‌కు మద్దతుగా ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేయడానికి $35 మిలియన్లను తాకట్టు పెట్టారు.
మరో వైపు HSR చట్టం కింద నిరీక్షణ కాలం ముగిసిందని Twitter Inc గత శుక్రవారం తెలిపింది. ఇప్పుడు ఒప్పందాన్ని పూర్తి చేయడం మిగిలిన షరతులకు లోబడి ఉంటుంది. ఇందులో Twitter స్టాక్‌హోల్డర్ల ఆమోదం. ఈ కొనుగోలు జరగాలంటే ట్విటర్ స్టాక్‌హోల్డర్ల ఆమోదం తప్పని సరిగా ఉండాలని, అందుకు వర్తించే రెగ్యులేటరీ ఆమోదాలు ఉన్నాయని ట్వట్టర్ పేర్కొంది. హెచ్‌ఎస్ చట్టం నిబంధనలకు మేరకు భారీ లావాదేవీలపై ఫెడరల్ ట్రేడ్ కమీషన్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ యాంటీట్రస్ట్ డివిజన్లు రివ్యూ చేయాలి.