Twitter: ఎలోన్‌ మస్క్‌కు షాక్‌ ఇచ్చిన ట్విట్టర్.. నిరీక్షణ కాలం ముగిసిందని ప్రకటన..

ప్రపంచ కుబేరుడు ఎలోన్‌ మస్క్‌కు ట్విట్టర్ షాక్‌ ఇచ్చింది. సోషల్ మీడియా సంస్థను ఎలోన్ మస్క్ $44 బిలియన్ల కొనుగోలు కోసం HSR చట్టం కింద నిరీక్షణ కాలం ముగిసిందని Twitter Inc శుక్రవారం తెలిపింది...

Twitter: ఎలోన్‌ మస్క్‌కు షాక్‌ ఇచ్చిన ట్విట్టర్.. నిరీక్షణ కాలం ముగిసిందని ప్రకటన..
Elon Musk
Follow us

|

Updated on: Jun 04, 2022 | 12:50 PM

ప్రపంచ కుబేరుడు ఎలోన్‌ మస్క్‌కు ట్విట్టర్ షాక్‌ ఇచ్చింది. సోషల్ మీడియా సంస్థను ఎలోన్ మస్క్ $44 బిలియన్ల కొనుగోలు కోసం HSR చట్టం కింద నిరీక్షణ కాలం ముగిసిందని Twitter Inc శుక్రవారం తెలిపింది. ఇప్పుడు ఒప్పందాన్ని పూర్తి చేయడం మిగిలిన షరతులకు లోబడి ఉంటుంది. ఇందులో Twitter స్టాక్‌హోల్డర్ల ఆమోదం. ఈ కొనుగోలు జరగాలంటే ట్విటర్‌ స్టాక్‌హోల్డర్ల ఆమోదం తప్పని సరిగా ఉండాలని, అందుకు వర్తించే రెగ్యులేటరీ ఆమోదాలు ఉన్నాయని ట్వట్టర్ పేర్కొంది. హెచ్‌ఎస్‌ చట్టం నిబంధనలకు మేరకు భారీ లావాదేవీలపై ఫెడరల్ ట్రేడ్ కమీషన్, యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ యాంటీట్రస్ట్ డివిజన్లు రివ్యూ చేయాలి.

అనంతరం రివ్యూ ఆదారంకు మస్క్‌..ట్విటర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరో ఆరు నెలలో పూర్తిగా ఎలన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌ వెళ్లాల్సి ఉంది. కానీ ఫేక్‌ అకౌంట్‌ల గురించి సంబధిత సమాచారం ఇవ్వాలని మస్క్‌ డిమాండ్‌ చేశారు. మస్క్‌ అభ్యర్థను ట్విటర్‌ తిర్కరించింది. దీంతో ట్విటర్‌ డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచినట్లు మస్క్‌ ప్రకటించారు. కాగా, ఈక్విటీ ఫైనాన్సింగ్ ద్వారా 33.5 బిలియన్లు, రుణాల ద్వారా 13 బిలియన్లను పొందారు. ఆ సమయంలో ట్విటర్‌ షేర్‌ వ్యాల్యూ దాదాపు 2శాతం పెరిగి 40.62 డాలర్లకు చేరుకుంది.