Google: గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు.. రూ.4 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశం.. ఎందుకంటే..

ప్రపంచ ప్రసిద్ధ సంస్థ గూగుల్‌కు ఓ కోర్టు షాకిచ్చింది. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్‌లో వైరల్‌ అయిన వివాదాస్పద వీడియోల కారణంగా అతడు రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, అందువల్ల ఆ నేతకు దాదాపు రూ.4కోట్లు చెల్లించాలని స్పష్టం చేసింది.

Google: గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు.. రూ.4 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశం.. ఎందుకంటే..
Google Search
Follow us

|

Updated on: Jun 06, 2022 | 5:05 PM

ప్రపంచ ప్రసిద్ధ సంస్థ గూగుల్‌కు ఓ కోర్టు షాకిచ్చింది. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్‌లో వైరల్‌ అయిన వివాదాస్పద వీడియోల కారణంగా అతడు రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, అందువల్ల ఆ నేతకు దాదాపు రూ.4కోట్లు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలోని న్యూ పౌత్‌ వేల్స్‌ డిప్యూటీ ప్రీమియర్‌గా ఉన్న జాన్‌ బరిలారోను విమర్శిస్తూ.. జోర్డాన్‌ శాంక్స్‌ అనే రాజకీయ విశ్లేషకుడు 2020 డిసెంబర్‌లో యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు పెట్టాడు. ఎలాంటి ఆధారాలు చూపించనప్పటికీ.. జాన్‌పై శాంక్స్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియోలు పోస్ట్‌ చేశాడు. దీంతో 2021 అక్టోబరులో జాన్‌ రాజకీయాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. అయితే దీనిపై అతను ఫెడరల్‌ కోర్టుకు వెళ్లాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది.

జాన్‌కు వ్యతిరేకంగా అప్‌లోడ్‌ చేసిన యూట్యూబ్‌ వీడియోల ద్వారా గూగుల్‌ వేలాది డాలర్లు సంపాదించిందని కోర్టు అభిప్రాయపడింది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా పదేపదే జాన్‌ను అవినీతిపరుడంటూ ఆరోపణలు చేయడం.. విద్వేష ప్రసంగం కంటే తక్కువేమీ కాదని పేర్కొంది. గూగుల్‌, శాంక్స్‌ ప్రచార వీడియోల కారణంగానే జాన్‌ 2021 అక్టోబరులో శాశ్వతంగా రాజకీయాలను వీడాల్సి పరిస్థితి ఏర్పడిందని చెప్పింది. ఈ వ్యవహారంలో గూగుల్ తీరు సమర్థనీయం కాదని.. జాన్‌ పరువుకు భంగం కలిగించినందుకు గానూ గూగుల్‌ ఆయనకు 7,15,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(5,15,00 అమెరికన్‌ డాలర్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై గూగుల్‌ను సంప్రదించగా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2020లో శాంక్స్‌ ఈ వీడియోలు పోస్ట్‌ చేయగా.. దాదాపు 8లక్షల వ్యూస్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి