AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: పీఎం కిసాన్‌ రూ.2000 మీ అకౌంట్లో పడలేదా.. అయితే వెంటనే ఈ పని చేయండి..

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద ఏడాదికి మూడు విడతల్లో రూ. 2000 వేల చొప్పున రూ.6000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్రం 11వ విడత నిధులు విడుదల చేసింది. అయితే కొంత మంది రైతులకు ఈ డబ్బులు రాలేదు...

PM Kisan Yojana: పీఎం కిసాన్‌ రూ.2000 మీ అకౌంట్లో పడలేదా.. అయితే వెంటనే ఈ పని చేయండి..
Pm Kisan
Srinivas Chekkilla
|

Updated on: Jun 06, 2022 | 4:16 PM

Share

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద ఏడాదికి మూడు విడతల్లో రూ. 2000 వేల చొప్పున రూ.6000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్రం 11వ విడత నిధులు విడుదల చేసింది. అయితే కొంత మంది రైతులకు ఈ డబ్బులు రాలేదు. కారణం వారు ఈ కేవైసీ చేసుకోకపోవడమే.. మరి ఇప్పుడు వారు ఏం చేయాలంటే.. వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ ప్రసెస్‌ కేవలం నిమిషాల్లో పూర్తవుతుంది. ఈకేవైసీని స్మార్ట్‌ఫోన్‌లో కూడా చెయ్యొచ్చు కానీ మీ ఆధార్‌ మొబైల్‌ నెంబర్‌కు లింక్‌ అయి ఉండాలి. మొబైల్‌ నెంబర్‌ ఆధార్‌కు లింక్‌ లేకుంటే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న మీసేవలోకి వెళ్లి మీ ఆధార్‌తో ఫోన్‌ నెంబర్‌ను లింక్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.

ఇప్పటికే ఆధార్‌తో ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయినవారు వారి స్మార్ట్‌ఫోన్‌లో https://pmkisan.gov.in/NewHome3.aspx సైట్‌లోకి వెళ్లాలి. అందులో ఫార్మర్‌ కార్నర్‌ అని ఉంటుంది. అందులో మొదటి ఆప్షన్‌ ఈకేవైసీ ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌ రీఫండ్‌, న్యూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్, ఎడిట్‌ ఆధార్‌ డిటైల్స్‌, బెనిఫిషరీ స్టేటస్‌, రిజిస్ట్రేషన్‌ స్టేటస్‌, బెనిఫిషరీ లిస్ట్‌ ఉంటుంది. ఇందులో ఈ కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్‌ నంబర్ అడుగుతుంది. మీ ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత లింక్‌ అయిన్‌ ఫోన్‌ నెంబర్ అడుగుతుంది. ఫోన్‌ నెంబర్‌ నమోదు చేయగానే నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత ఆధార్‌ వెరిఫికేషన్‌ ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ 6 అంకెలు ఉంటుంది. ఈ ఓటీపీ ఎంటర్‌ చేసి సడ్మిట్‌ చేయగానే సక్సెస్‌ఫుల్‌ ఈకేవైసీ అని వస్తుంది. దీంతో మీ ప్రాసెస్‌ పూర్తవుతుంది. మొబైల్ నెంబర్ లింక్‌ కానివారు మీసేవకు వెళ్లి మీ బయోమెట్రిక్‌ ఇచ్చి ఫోన్‌ నెంబర్‌ లింక్ చేయించాలి. ఆ తర్వాత పైన ఉన్న ప్రాసెస్‌ ప్రకారం ఈకేవైసీ చేసుకోవాలి.

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!