Fact Check: పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై భారీ తగ్గింపు.. ఇందులో నిజమెంత..?
Fact Check: అమాయకులను మోసం చేసేందుకు మోసగాళ్లు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. లేనిపోనివి సృష్టించి, అమాయకుల..
Fact Check: అమాయకులను మోసం చేసేందుకు మోసగాళ్లు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. లేనిపోనివి సృష్టించి, అమాయకుల ఫోన్‌లకు మెసేజ్‌లు పంపుతూ మోసగిస్తున్నారు. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు సంబంధించి ఓ సందేశం తెగ వైరల్ అవుతోంది. ప్రజలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. కానీ, సైబర్ నేరగాళ్లు ఒక్కోసారి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల పేరిట నకిలీ పథకాల సందేశాలను ప్రజలకు పంపుతున్నారు. దీంతో ప్రజలు సైబర్ నేరాలకు గురవుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో డిజిటలైజేషన్ చాలా వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రజలు తమ పనిని ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా చేయడం ప్రారంభించారు. కానీ, పెరుగుతున్న డిజిటలైజేషన్ ప్రభావంతో పాటు, దేశంలో సైబర్ మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినియోగదారుల కోసం సబ్సిడీ క్విజ్‌తో ముందుకు వచ్చిందని వైరల్ సందేశంలో పేర్కొంటున్నారు. మరి వైరల్ అవుతున్న ఈ మెసేజ్‌లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకుందాం.
PIB ట్వీట్
వైరల్ అవుతున్న పోస్టు పై నిజాలను వెల్లడించింది పీఐబీ ఫ్యాక్‌చెక్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లక్కీ డ్రాను నిర్వహించిందని, ఈ డ్రాలో కస్టమర్లు కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. సరైన సమాధానం ఇస్తే వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై రూ. 6,000 పూర్తి తగ్గింపును పొందుతారన్నది ఈ మెసేజ్ అర్థం.
A lucky draw in the name of Indian Oil Corporation is viral on social media and is offering a chance to win a Fuel Subsidy Gift worth ₹6,000 after seeking one’s personal details#PIBFactCheck
▶️This lucky draw is #FAKE
▶️It’s a scam & is not related to @IndianOilcl pic.twitter.com/aBOC9E3Ttw
— PIB Fact Check (@PIBFactCheck) June 5, 2022
దీనిపై PIB ఫాక్ట్ చెక్ ఈ పోస్ట్ పూర్తిగా నకిలీదని తెలిపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అటువంటి లక్కీ డ్రాను నిర్వహించడం లేదు. దీనితో పాటు, ప్రజలు అలాంటి సందేశాలను ఏ మాత్రం పట్టించుకోవద్దు అని సూచించింది. ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇలా వైరల్ అవుతున్న, ఫోన్‌లకు పంపుతున్న మెసేజ్‌లలో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి