Wheat Exports: భారత్ ఎగుమతి చేసిన గోధుమలపై వివాదం.. మెుదట టర్కీ, ఇప్పుడు ఈజిప్ట్ తిరస్కరించాయి.. ఎందుకంటే
Wheat Exports: భారత్ నుంచి ఎగుమతి అవుతున్న 55 వేల టన్నుల గోధుమలపై వివాదం పెరుగుతోంది. సరుకును మొదట టర్కీకి పంపారు. కానీ సరకు పాడైందంటూ టర్కీ కొనుగోలు చేయడానికి నిరాకరించింది.
Wheat Exports: భారత్ నుంచి ఎగుమతి అవుతున్న 55 వేల టన్నుల గోధుమలపై వివాదం పెరుగుతోంది. సరుకును మొదట టర్కీకి పంపారు. కానీ సరకు పాడైందంటూ టర్కీ కొనుగోలు చేయడానికి నిరాకరించింది. తరువాత.. ఈజిప్టు ఆ గోధుమలను కొనడానికి సిద్ధమైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈజిప్టు అధికారి దేశ సరిహద్దులోకి ప్రవేశించే ముందు గోధుమలతో నిండిన ఓడను ఆపారు. ఈజిప్ట్ ప్లాంట్ క్వారంటైన్ చీఫ్ అహ్మద్ అతార్ వార్తా సంస్థతో మాట్లాడుతూ గోధుమలతో నిండిన ఓడ ఈజిప్టు సరిహద్దులోకి ప్రవేశించేలోపు ఆపివేయబడిందని తెలిపారు. టర్కీ ఇప్పటికే ఈ సరుకును అంగీకరించడానికి నిరాకరించింది.
ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలను దిగుమతి చేసుకునే దేశం ఈజిప్ట్. ఈజిప్ట్ ప్రైవేట్ సెక్టార్ తరపున ఈ కొనుగోలను భారత్ నుంచి జరిగింది. సరుకు శనివారం అక్కడికి చేరాల్సి ఉండగా.. చివరి క్షణంలో సరుకు ప్రవేశానికి నిరాకరించారు. ముందుగా భారత్ నుంచి 50 వేల టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నామని ఈజిప్టు పౌర సరఫరా మంత్రి తెలిపారు. ఇది టెండర్ల ప్రక్రియకు భిన్నంగా ఉంటుంది. అయితే అధికారులు లోడ్ అనుమతించేందుకు ఇంకా సంతకం చేయలేదు.
ఏప్రిల్ నెలలో.. ఈజిప్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖ భారత్ నుంచి గోధుమలను దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది. నిజానికి ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమలకు కొరత ఏర్పడింది. స్థానిక స్థాయిలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు భారత మార్కెట్ నుంచి 35 లక్షల టన్నుల గోధుమలను ఈజిప్ట్ సేకరించినట్లు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యుద్ధం కారణంగా రవాణా ఇబ్బంది కావటంతో ఈజిప్టు భారతదేశం నుంచి సహాయం కోరింది. దీంతో గత నెలలో మాత్రమే భారత్ 61,500 టన్నుల గోధుమలను ఈజిప్టుకు ఎగుమతి చేసింది. ఈ సరుకు ఈజిప్టుకు సరిపోనప్పటికీ. ఈ కారణంగా.. ఈజిప్టు కూడా టర్కీ తిరస్కరించిన గోధుమలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.
భారత్ నుంచి ఎగుమతి అవుతున్న గోధుమల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నల మధ్య, ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే మాట్లాడుతూ.. ఈ విషయంలో ప్రభుత్వం టర్కీ పరిపాలన నుంచి వివరణాత్మక సమాధానం కోరింది. ఈ గోధుమలను ఐటీసీ కంపెనీ ఎగుమతి చేసింది. ఎగుమతులకు సంబంధించి ప్రతి స్థాయి నుంచి క్లియరెన్స్ ఉందని కంపెనీ పేర్కొంది. మొదట జెనీవా ఆధారిత కంపెనీకి గోధుమలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. తర్వాత ఆ కంపెనీ ఈ గోధుమలను టర్కీ కంపెనీకి విక్రయించింది. మే 13న గోధుమ ఎగుమతులను నిషేధించాలని భారత్ నిర్ణయించిన విషయం మనందరికీ తెరిసిందే.