Telangana: అసలు నోట్లుగా నమ్మిస్తారు.. నమ్మితే నట్టేట ముంచేస్తారు.. ముఠాను పట్టుకున్న పోలీసులు

ఈ నోట్లు చూడ్డానికి సేమ్ టూ సేమ్ ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ మాదిరే ఉంటాయి. కానీ.. అవి నకిలీ గాళ్లు సృష్టించిన ఫేక్ నోట్లు(Fake Currency). అసలు నోటు ఏదో, నకిలీదేదో తెలియక జనం తేలిగ్గా మోసపోయేలా ప్లాన్ చేశారు....

Telangana: అసలు నోట్లుగా నమ్మిస్తారు.. నమ్మితే నట్టేట ముంచేస్తారు.. ముఠాను పట్టుకున్న పోలీసులు
Fake Currency
Follow us
Ganesh Mudavath

| Edited By: Rajeev Rayala

Updated on: Jun 08, 2022 | 10:11 AM

ఈ నోట్లు చూడ్డానికి సేమ్ టూ సేమ్ ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ మాదిరే ఉంటాయి. కానీ.. అవి నకిలీ గాళ్లు సృష్టించిన ఫేక్ నోట్లు(Fake Currency). అసలు నోటు ఏదో, నకిలీదేదో తెలియక జనం తేలిగ్గా మోసపోయేలా ప్లాన్ చేశారు ఈ కేటుగాళ్లు. ఖమ్మం జిల్లా చర్లలో ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. చర్ల మండలంలో ఉన్న అమాయక ఆదివాసీలే టార్గెట్‌గా నకిలీ గ్యాంగ్ మోసాలకు పాల్పడుతోంది. గుంటూరు (Guntur)జిల్లా తెనాలికి చెందిన దొంగనోట్ల ముఠా.. చర్ల మండలం తెగడా, కలివేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి, కొంత కాలంగా చర్లలో దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న కిరాణా షాపులు, నాన్ వెజ్ మార్కెట్లలో నకిలీ నోట్లతో నిలువునా ముంచేస్తోందీ దొంగ గ్యాంగ్. తాజాగా కారులో దొంగనోట్లను తరలిస్తుండగా చర్లలో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి 5లక్షల 15 వేల 500 విలువ గల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్టు భద్రాచలం(Bhadrachalam) ఏఎస్పి రోహిత్ రాజు తెలిపారు.

2వందలు, 5వందలు, 2వేల నోట్లను తెనాలిలో ముద్రించి చర్ల పరిసర ప్రాంతాల్లో చలామణి చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగ నోట్లతో పాటు ఫేక్ కరెన్సీని తయారు చేసే యంత్రాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో చేతులు కలిపిన ఒక బాలుడు, ఒక యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!