National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు.. నేను విచారణకు హాజరు కాలేదు.. ఈడీకి సోనియా అభ్యర్థన
National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు బుధవారం విచారణ జరుగనుంది. ఈ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..
National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు బుధవారం విచారణ జరుగనుంది. ఈ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi )ఈడీ (ED)విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తాను రాలేనని దర్యాప్తు సంస్థను అభ్యర్థించారు. కరోనా నుంచి కోలుకోలేనందున విచారణకు హాజరయ్యేందుకు మరింత కొంత సమయం ఇవ్వాలని సోనియా ఈడీకి విజ్ఞప్తి చేశారు. సోనియాగాంధీ జూన్ 2న కరోనా బారిన పడ్డారు. ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెకు నెగిటివ్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని ఈడీని అభ్యర్థించారు.
ఈ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జూన్ 13న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ జూన్ 2న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, ప్రస్తుతం తాను భారత్‌లో లేనందున విచారణకు అందుబాటులో ఉండనని ఈడీకి సమాచారం అందించారు. షెడ్యూల్ ప్రకారం తనకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. అందుకు సమ్మతించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. జూన్ 13న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు రావాలని మళ్లీ సమన్లు అందజేసింది.
కాగా, కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు ప్రయత్నించారని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి