AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP JP Nadda: కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్ర సర్కార్‌పై జేపీ నడ్డా విమర్శలు

రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు.. కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

BJP JP Nadda: కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్ర సర్కార్‌పై జేపీ నడ్డా విమర్శలు
Jp Nadda
Sanjay Kasula
|

Updated on: Jun 07, 2022 | 7:18 PM

Share

రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు.. కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు నడ్డా మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉంటుందని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలు ఉండేవన్నారు. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదన్నారు. గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలుగా నిలిచేవని.. మోదీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. గతంలో బంధుప్రీతి వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేదన్నారు. మోదీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారని అన్నారు. దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నారు.

ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేసి.. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు గతంలో పేపర్లకే పరిమితమయ్యేవి.. ప్రస్తుతం దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. భారతదేశం ఉత్పాతక దేశంగా మారిందని.. భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరిగాయని తెలిపారు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా 2.5కోట్ల ఇళ్లు నిర్మించినట్లుగా వెల్లడిచారు. పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనేదే మోదీ కల.. ఆ కలను నెరవేరుస్తాని పేర్కొన్నారు. ఒకే దేశం- ఒకే గ్రిడ్‌, ఒకే దేశం- ఒకే రేషన్‌ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. భారత్‌ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది. రెండో అతి పెద్ద రిటైల్‌ చైన్‌గా భారత్‌ మారిందన్నారు. దేశంలో 79 కోట్ల బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నాం. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాలని జేపీ నడ్డా అన్నారు