AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fishing Harbor: కలగానే ఫిషింగ్‌ హార్బర్లు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రారంభానికి నోచుకోని పనులు..

సముద్రతీరంలో 392 కోట్ల రూపాయలతో మొత్తం 820 పడవలను నిలిపే విధంగా హార్బర్‌ సామర్థ్యం కలిగి ఉండేలా నిర్మించేందుకు నిర్ణయించారు. దీని పరిధిలో ఏడాదికి 27 వేల 500 మెట్రిక్‌ టన్నుల చేపలను పట్టుకునే అవకాశం ఉంటుంది.

Fishing Harbor: కలగానే ఫిషింగ్‌ హార్బర్లు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రారంభానికి నోచుకోని పనులు..
Fishing Harbor
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2022 | 8:36 PM

Share

కొత్తపట్నంలో ఫిషింగ్‌ హార్బర్ నిర్మాణం కలగానే మిగిలిపోతోంది‌… ఏదాడి క్రితమే ప్రభుత్వం ప్రకటించినా అడుగు ముందుకు పడటం లేదు… ప్రకాశంజిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో 392 కోట్ల రూపాయలతో మొత్తం 820 పడవలను నిలిపే విధంగా హార్బర్‌ సామర్థ్యం కలిగి ఉండేలా నిర్మించేందుకు నిర్ణయించారు. దీని పరిధిలో ఏడాదికి 27 వేల 500 మెట్రిక్‌ టన్నుల చేపలను పట్టుకునే అవకాశం ఉంటుంది. స్థానిక మత్స్యకారులు కూడా పడవలను ఒడ్డుకు చేర్చకుండా హార్బర్‌లో నిలుపుకొనే వీలు కలుగుతుంది… అలాంటి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని మత్స్యకార సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 3వేల కోట్ల రూపాయలతో 8 చోట్ల ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నేటీకి పనులు ప్రారంభం కాలేదు… ప్రకాశంజిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో 392 కోట్ల రూపాయలతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఏడాది క్రితమే నిర్ణయించింది. ఇక్కడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ నిమిత్తం సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక…డీపీఆర్‌ ను ఇప్పటికే అధికారులు తయారు చేశారు. మొత్తం 820 పడవలను నిలిపే విధంగా హార్బర్‌ సామర్థ్యం కలిగి ఉండేలా నిర్మించేందుకు నిర్ణయించారు. దీని పరిధిలో ఏడాదికి 27 వేల 500 మెట్రిక్‌ టన్నుల చేపలను పట్టుకునే అవకాశం ఉంటుంది. స్థానిక మత్స్యకారులు కూడా పడవలను ఒడ్డుకు చేర్చకుండా హార్బర్‌లో నిలుపుకొనే వీలు కలుగుతుంది… అయితే ఫిషింగ్‌ హార్బర్‌ విధి, విధానాలు చెప్పాలని గ్రామంలోని కొంతమంది మత్స్యకారుల సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు… హార్బర్‌ నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదా, ప్రైవేటుదా, నాయకులదా అని ప్రశ్నిస్తున్నారు… కాలువల నిర్మాణం ద్వారా తీరం కోతకు గురవుతుందని, భవిష్యత్తులో చుట్టుపక్కల గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని, ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై స్పష్టత ఇచ్చాక ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కోరారు… అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కొత్తపట్నంలో మత్స్యకారులతో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసింది… ఈ సందర్బంగా పలువురు మత్స్యకారులు తమకు ఉన్న అనుమానాలను ఏకరువు పెట్టారు… హార్బర్‌ విధివిధానాలు సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా చూడాలని కోరారు… ఈ సందర్బంగా మత్స్యకారుల ఆర్ధిక అభివృద్ది, ఉపాధి అవకాశాల ప్రాతిపదికనే హార్బర్‌ నిర్మాణం ఉంటుందని అధికారులు హామీ ఇచ్చారు… దీంతో కొత్తపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌కు మార్గం సుగమం అయింది… ఇది జరిగి ఏడాది అయింది… అయితే ఇంత వరకు హార్బర్‌ నిర్మాణపనులు ప్రారంభం కాకపోవడంతో మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి… కొత్తపట్నం ప్రాంతంలో త్వరితగతిన హార్బర్‌ నిర్మాణం చేపట్టాలని మత్స్యకార సంఘాలతో పాటు ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొత్తపట్నంలో 392 కోట్ల రూపాయలతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అందులో భాగంగానే 35 ఎకరాలు భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ కూడా ఇచ్చామని మత్సకారశాఖ జెడి చంద్రశేఖర్‌రెడ్డి చెబుతున్నారు… ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, మరో రెండు నెలల్లో హార్బర్‌ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు… కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా 25 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఈ హార్బర్‌ పూర్తయితే ఇక్కడ చేపల వేలం, కోల్డ్ స్టోరేజి, ప్యాకింగ్‌ వంటి ఉపాధి అవకాశాలు ఉంటే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే హార్బర్‌ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు.