AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulkampeta ellamma: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరార్‌.. ఏ రోజున ఏఏ వేడుకలు చేస్తారు..

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం ఈ యేడు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. ఈ మేరకు అమ్మవారి కల్యాణానికి ముహూర్తం ఖరారు చేశారు. అమ్మవారి కల్యాణానికి నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు..

Bulkampeta ellamma: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరార్‌.. ఏ రోజున ఏఏ వేడుకలు చేస్తారు..
Ellamma Thalli
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2022 | 7:01 PM

Share

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం ఈ యేడు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. ఈ మేరకు అమ్మవారి కల్యాణానికి ముహూర్తం ఖరారు చేశారు. జూలై 5 వ తేదీన అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 5న అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా జులై 4వ తేదీన ఎదుర్కోళ్ళు, 5వ తేదీన కళ్యాణం, ఆరవ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు.

అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అమ్మవారి కళ్యాణం, బోనాలు ఇతర అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కల్యాణానికి నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. ఇక బోనాల పండుగలో ఎలాంటి తోపులాటలకు అవకాశం లేకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుందని మంత్రి తెలిపారు.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..