AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet train: ప్రయాణికుల కోసం ప్రాణ త్యాగం చేసిన డ్రైవర్‌.. వందల మందిని కాపాడి అమరుడయ్యాడు..

ఒక రైలు లోకో పైలట్ ప్రయాణికులను రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేసి హీరో అయ్యాడు. రైలు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో వేగంగా వెళ్తోన్న రైలుకు పెను ప్రమాదం తప్పదని గ్రహించిన లోకో పైలట్‌, ఎవరూ చేయని రిస్క్‌ చేశాడు. ప్రయాణికుల ప్రాణాలు రక్షించడం కోసం తను ప్రాణత్యాగం చేశాడు..

Bullet train: ప్రయాణికుల కోసం ప్రాణ త్యాగం చేసిన డ్రైవర్‌.. వందల మందిని కాపాడి అమరుడయ్యాడు..
Bullet Train
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2022 | 6:32 PM

Share

ఒక రైలు లోకో పైలట్ ప్రయాణికులను రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేసి హీరో అయ్యాడు. రైలు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో వేగంగా వెళ్తోన్న రైలుకు పెను ప్రమాదం తప్పదని గ్రహించిన లోకో పైలట్‌, ఎవరూ చేయని రిస్క్‌ చేశాడు. ప్రయాణికుల ప్రాణాలు రక్షించడం కోసం తను ప్రాణత్యాగం చేశాడు.. జరిగిన ప్రమాదంలో రైలు కో పైలట్‌ మృతి చెందగా, మరో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే పట్టాలు తప్పిన ఐదు సెకన్ల వ్యవధిలోనే లోకో పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలు ఆగిన వెంటనే మృతి చెందాడు. ఈ ఘటన చైనాలో వెలుగు చూసింది. అతడు చేసిన ప్రాణత్యాగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చైనాలోని రోంగ్‌జియాంగ్ స్టేషన్‌లో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఇక్కడి నుంచి దక్షిణ ప్రావిన్స్ గ్వాంగ్‌జౌకు వెళ్తున్న బుల్లెట్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి ఐదు సెకన్ల వ్యవధిలో రైలును ఆపేశాడు. దాంతోమ రైల్లో ప్రయాణిస్తున్న 144 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగాడు. కానీ తను మాత్రం మృత్యువాతపడ్డాడు. తన ప్రాణం పోతుందని తెలిసినా.. రైలును పట్టాలు తప్పించి.. దానిలో ఉన్న 144 మంది ప్రాణాలు కాపాడాడు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ఉన్నారు.

ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా రైలు డేటాను విశ్లేషించారు. ఈ క్రమంలో రైలు రోంగ్‌జియాంగ్ స్టేషన్‌కు సమీపంలో సొరంగంలో ఉన్నప్పుడు ట్రాక్‌పై అసాధారణతను గుర్తించిన డ్రైవర్‌ యాంగ్‌ అత్యవసర బ్రేక్‌లను లాగాడు. దాంతో రైలు పట్టాలు తప్పింది. అలా 900 మీటర్ల పాటు రాళ్లు, మట్టిని ఢీకొని.. ఆ తర్వాత ఆగిపోయింది. ఫలితంగా డ్రైవర్‌ యాంగ్‌ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినవారు.. అతడి త్యాగాన్ని స్మరించుకుంటూ.. నివాళులర్పిస్తున్నారు. తన ప్రాణం త్యాగం చేసి.. ప్రయాణికులను కాపాడిన యాంగ్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.

ఇవి కూడా చదవండి

ఇక మరణించిన కోపైలట్‌ యోంగ్ ఎవరన్నది ఆరా తీయగా, యోంగ్‌ ఒక మాజీ సైనికుడని తెలిసింది. 1993-1996 వరకు పీపుల్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (PAP) యొక్క హైనాన్ కార్ప్స్‌లో పనిచేశాడు. స్క్వాడ్రన్ లీడర్‌గా, అత్యుత్తమ సైనికుడిగా గుర్తింపు పొందాడు.. పదవీ విరమణ చేసిన తర్వాత, యోంగ్ కో-డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, ఫోర్‌మెన్, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్, గ్రౌండ్ డ్రైవర్, రైలు కో పైలట్‌గా పనిచేశాడు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన యోంగ్‌ని చైనా ప్రజలు హీరోగా కొనియాడుతున్నారు. వార్త ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారటంతో నెటిజన్లు సైతం నివాళులు అర్పిస్తున్నారు.