Hollywood: ఇండియన్‌ రెస్టారెంట్‌లో హలీవుడ్‌ హీరో విందు.. ఇచ్చిన టిప్‌ చూసి షాకైన యజమాని

ఎవరైనా హోటల్‌కి వెళ్లినా, రెస్టారెంట్‌కి వెళ్లినా కావాల్సిన తిన్న తర్వాత అక్కడి సిబ్బందికి టిప్‌ ఇవ్వటం అనేది మామూలుగా జరుగుతుంటుంది. అయితే, ఆ ఇచ్చే టిప్‌ ఎంత ఉంటుంది. స్థాయికి తగ్గట్టుగా..

Hollywood: ఇండియన్‌ రెస్టారెంట్‌లో హలీవుడ్‌ హీరో విందు.. ఇచ్చిన టిప్‌ చూసి షాకైన యజమాని
Johnny Depp
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 07, 2022 | 5:54 PM

ఎవరైనా హోటల్‌కి వెళ్లినా, రెస్టారెంట్‌కి వెళ్లినా కావాల్సిన తిన్న తర్వాత అక్కడి సిబ్బందికి టిప్‌ ఇవ్వటం అనేది మామూలుగా జరుగుతుంటుంది. అయితే, ఆ ఇచ్చే టిప్‌ ఎంత ఉంటుంది. స్థాయికి తగ్గట్టుగా పదుల సంఖ్య నుండి మొదలుకుంటే… వందలు, వేల వరకు ఉంటుంది. కానీ, ఒక హాలీవుడ్‌ హీరో ఇచ్చిన టిప్‌ ఇప్పుడు సోషల్ మీడియానే షేక్‌ చేస్తోంది. అతడు ఇచ్చిన టిప్‌కు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఎవరా హీరో, ఏంట సంగతి..పూర్తి వివరాల్లోకి వెళితే..

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాల సిరీస్‌తో పాపులర్ అయిన హాలీవుడ్‌ హీరో జానీడెప్ ఇటీవల తన మాజీ భార్య మీద పరువు నష్టం కేసు వేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఆనందంతో జానీడెప్ టూర్లకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే హీరో జానీ డెప్, సంగీతకారుడు జెఫ్ బెక్‌తో కలిసి బర్మింగ్‌హామ్‌లోని భారతీయ రెస్టారెంట్‌లో భోజనం చేశాడు. అతను భోజనం కోసం సుమారు $60,000 ఖర్చు చేసినట్లు సమాచారం. అంతేకాదు, అతడు భోజనం చేసిన హోటల్‌ సిబ్బందికి టిప్పు కూడా భారీగా ఇచ్చాడట. ప్రస్తుతం జానీడెప్‌ ప్రముఖ గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి బ్రిటన్‌లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 5న బర్మింగ్ హామ్‌లోని వారణాసి భారతీయ రెస్టారెంట్‌ లో భోజనం చేశారు. ముందుగా కాక్ టెయిల్ పార్టీ చేసుకున్నారు. అనంతరం బటర్ చికెన్, పనీర్ టిక్కా మసాలా, లాంబ్ కరాచి, రైస్ వంటి భారతీయ వంటకాలను టేస్ట్ చేశారు. డిన్నర్ పూర్తయిన తర్వాత జానీడెప్ బిల్లు ఎంతయిందన్నది కూడా చూడకుండా టేబుల్‌పై ఏకంగా 50 వేల పౌండ్లను పెట్టి వెళ్లిపోయాడు. ఈ మొత్తానికి భారతీయ కరెన్సీలో చూసుకుంటే రూ. 48 లక్షలవుతుంది.

ఇంత భారీ మొత్తం టిప్‌ ఇవ్వటం చూసి హోటల్ యజమాని ఒకింత షాక్‌ అయ్యాడు. జానీడెప్ వంటి స్థాయి ఉన్నవారు తమ రెస్టారెంటులో భోజనం చేయడమే గొప్ప అనుకుంటే, ఇంత భారీ స్థాయిలో డబ్బు ఇవ్వడం నిజంగా గొప్ప విషయమంటూ ప్రశంసించారు. రెస్టారెంట్‌ సిబ్బందితో కలిసి జానీ దిగిన ఫోటోలు, వీడియోలను హోట్‌ యాజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో భాగంగా జానీ టిప్‌ విషయం కూడా షేర్‌ చేశాడు హోటల్ యజమాని మహమ్మద్ హుస్సేన్. కానీ, ఇక్కడ జానీ హోటల్‌ బిల్లు ఎంతయిందన్నది మాత్రం చెప్పలేదు.

ఇవి కూడా చదవండి
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు