AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ముళ్ల పొదల నుంచి ఏడుపు శబ్ధాలు.. స్థానికులు వెళ్లి ఎంటా అని చూడగా..

ఆ ప్రదేశం మండలకేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. సమీపంలోనే సబ్ స్టేషన్‌ కూడా ఉంది. జనాల రద్దీ కాస్త తక్కువగానే ఉంటున్న ప్రాంతం అది. అప్పుడే తెల్ల తెల్లవారుతోంది. ప్రజలు ఒక్కోక్కరుగా నిద్రలేస్తున్నారు. సూర్యోదయానికి ముందుగా నిద్రలేచినవారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ, చుట్టూ అంతా నిశబ్ధ వాతావరణం..అంతలోనే సమీప ముళ్ల పొదల్లోంచి ఏడుపు శబ్ధం

Andhra Pradesh: ముళ్ల పొదల నుంచి ఏడుపు శబ్ధాలు.. స్థానికులు వెళ్లి ఎంటా అని చూడగా..
Representative image
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2022 | 3:33 PM

Share

ఆ ప్రదేశం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. సమీపంలోనే సబ్ స్టేషన్‌ కూడా ఉంది. జనాల రద్దీ కాస్త తక్కువగానే ఉంటున్న ప్రాంతం అది. అప్పుడే తెల్ల తెల్లవారుతోంది. ప్రజలు ఒక్కోక్కరుగా నిద్రలేస్తున్నారు. సూర్యోదయానికి ముందుగా నిద్రలేచినవారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ, చుట్టూ అంతా నిశబ్ధ వాతావరణం..అంతలోనే సమీప ముళ్ల పొదల్లోంచి ఏడుపు శబ్ధం వినిపించింది. అది విన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. శబ్ధాలు ఆగలేదు. పసికందు గుక్కపెట్టి ఏడుస్తున్న ఏడుపు మరింత గట్టిగా వినిపిస్తోంది. జనమంతా నిద్రలేచారు. ఏంటా శబ్ధాలు, ఎక్కడిది పసికందు ఏడుపు అని అంతా గాలించారు. అంతలోనే అక్కడ ఉన్నది చూసి షాక్‌ అయ్యారు. ముళ్లపొదల్లో ముద్దులొలికే బాలుడు కనిపించాడు. ఎవరీ బాబు అని చుట్టూ చూశారు..కానీ, ఎవరూ కనిపించలేదు. నిర్జీన ప్రదేశంలోకి అప్పుడే పుట్టిన పసికందు ఎలా వచ్చాడో తెలియక స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. నవమాసాలు మోసి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరో కానీ, ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. అప్పుడేపుట్టిన మగ శిశువును ముళ్లపొదలో పారవేసింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే పోలీసులు, సమీప ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. శిశువుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే…

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సమీపంలో అప్పుడే పుట్టిన మగశిశువును ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. తెల్లవారుజామున ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మగ శిశువును ముళ్ళ పోదలు కింద వదిలేసి వెళ్లారు. శిశువు ఏడుపు శబ్ధాలు విన్న స్థానికులు పసికందును చూసి నివ్వెర పోయారు. వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆస్పత్రి మగ శిశువును ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు.

Atp Baby

Atp Baby

ఏ వంక లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో, చూడముచ్చటగా మగశిశువును ఆ తల్లి ఎందుకు వదిలివెళ్లిందో ఎవరికీ తెలియటం లేదు. పాపం పసికందు ఏ పాపం చేసుకున్నాడో అంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..