Anukoni Prayanam Movie: ఆయన గొప్ప నటుడు.. ప్రతి క్షణం నవ్వుతూనే నటించాను.. నటుడు నరసింహ రాజు ఆసక్తికర కామెంట్స్..

ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అనుకోని ప్రయాణం'. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం

Anukoni Prayanam Movie: ఆయన గొప్ప నటుడు.. ప్రతి క్షణం నవ్వుతూనే నటించాను.. నటుడు నరసింహ రాజు ఆసక్తికర కామెంట్స్..
Actor Narasimha Raju
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2022 | 9:34 PM

ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ అందించడం మరో విశేషం.

నరసింహ రాజుగారు మాట్లాడుతూ.. డా.జగన్ మోహన్ గారు గొప్ప డాక్టర్. తనచుట్టుపక్కల వారికి ఎంతో సేవ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి సినిమా నిర్మాణ రంగలోకి రావడం, ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను నటించడం ఆనందంగా వుంది. రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసినప్పుడు ప్రతి సీన్ నవ్వుకున్నాను. ప్రేక్షకులకు కూడ అదే అనుభూతి కలుగుతుంది. నిర్మాతలు చాలా గొప్ప కథతో వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కథ ఒప్పుకున్నారంటేనే విజయం కింద లెక్క. ఇలాంటి విజయవంతమైన చిత్రంలో భాగం కావడం ఆనందంగా వుంది” అన్నారు