Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత.. రేపటి నుంచి..
ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 18 వరకూ సాధారణ బదిలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Good news for teachers: ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 18 వరకూ సాధారణ బదిలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ బదిలీల్లో భాగంగా.. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరిస్తూ పేర్కొన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఆర్డర్ కాపీలో ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రతి ఉద్యోగికి భరోసా కల్పించడమే ప్రభుత్వ విధానమని తెలిపింది. మెరుగైన పాలన, సమర్థవంతమైన ప్రజా సేవల కోసం, పరిపాలనలో సమర్ధత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి సిబ్బందిని సరైన స్థానంలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతోపాటు.. పారదర్శకంగా బదిలీలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
GO MS 116-Transfers & postings Guidelines
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..