AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేయండి.. సీఐడీ డీఐజీకి ఫిర్యాదు చేసిన దేవినేని ఉమా..

ఏపీలో ఫేక్ ట్వీట్‌ల రచ్చ కొనసాగుతోంది. గతవారం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్‌లు జోరుగా వైరల్ అయ్యాయి.

TDP: మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేయండి.. సీఐడీ డీఐజీకి ఫిర్యాదు చేసిన దేవినేని ఉమా..
Devineni Uma
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 07, 2022 | 2:25 PM

Share

ఏపీలో ఫేక్ ట్వీట్‌ల రచ్చ కొనసాగుతోంది. గతవారం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్‌లు జోరుగా వైరల్ అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై దేవినేని ఉమ రంగంలోకి దిగారు. తన పేరుతో నకిలీ ట్వీట్‌ సృష్టించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ ట్వీట్‌ను ప్రచారంలో పెట్టిన మంత్రి అంబటి రాంబాబుపై మంగళవారం ఉదయం సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు దేవినేని ఉమ. ఈ నకిలీ ట్వీట్‌ను తనతోపాటు అనేక మందికి పంపిన మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశాలన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్‌ చేసినట్లు ఒక ఫేక్ ట్వీట్ వైరల్ చేశారన్నారు. ఇకైనా నకిలీ ప్రచారాలు మానుకోవాలని అన్నారు. టీడీపీ నేతలైన వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బచ్చుల అర్జునుడు సహా తన పేరుతో కూడా వైఎస్సార్‌సీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ ట్వీట్లు పెట్టారని అన్నారు. చివరకు తమ అధినేత చంద్రబాబు సంతకం, పార్టీ లెటర్ హెడ్ పోర్జరీ చేశారన్నారు.

భాద్యత గల మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబు ఆ ఫేక్ ట్వీట్‌ను సమర్ధిస్తూ ట్వీట్ చేశారంటే అందులో ఉన్న కుట్రకోణం అర్దమవుతుందన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఫేక్ ట్వీట్లను మంత్రే షేర్ చేస్తున్నారంటే దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

మంత్రి అంబటి రాంబాబు స్వయంగా ట్విట్ చేశాడన్నారు. ఇందులో కుట్ర కోణం ఉందన్నారు. కులాలు మధ్య, పార్టీలు మధ్య చిచ్చు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలని సూచించారు. గౌతు శిరీషను ఉదయం నుంచి విచారణ చేస్తున్నారని, ఏ మంత్రి ప్రెస్‌మీట్ పెట్టాలన్న సజ్జల నుంచి స్క్రిప్టు వస్తుందన్నారు. ఫేక్ ట్విట్ పెట్టిన మంత్రి అంబటి రాంబాబును విచారణ చేస్తారా? అని ఉమా ప్రశ్నించారు. తన మీద ఫేక్ ట్వీట్ ఎవరు పెట్టారో సీఐడీ అధికారులు విచారణ జరపాలన్నారు. తప్పుడు ట్విట్‌ను ఎలా బాధ్యత గల మంత్రి రీ ట్విట్ చేస్తారు? అని ప్రశ్నించారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్