AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: కుప్పంలో టీడీపీ నేత ఇంటిపై మద్యం బాటిళ్లుతో దాడి.. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారన్న చంద్రబాబు

అర్థరాత్రి సమయంలో రవి ఇంటిపై మద్యం సీసాలు, రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి ఇంటిపై దాడి ఘటనపై చంద్రబాబు కుప్పం పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడారు. గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ గా..

Chandrababu: కుప్పంలో టీడీపీ నేత ఇంటిపై మద్యం బాటిళ్లుతో దాడి.. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారన్న చంద్రబాబు
Chandrababu
Sanjay Kasula
|

Updated on: Jun 07, 2022 | 1:03 PM

Share

చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ ఆర్ రవి ఇంటిపై దుండగుల దాడిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు(Chandrababu) ఖండించారు. అర్థరాత్రి సమయంలో రవి ఇంటిపై మద్యం సీసాలు, రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి ఇంటిపై దాడి ఘటనపై చంద్రబాబు కుప్పం పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడారు. గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ గా ఉన్న సమయంలో రవి 35 లక్షల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్సిడ్ డిపాజిట్ల విషయంలో కొద్ది కాలంగా వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాడికి రెండు గంటల ముందు కూడా ఫోన్ చేసి రవిని బెదిరించినట్లు స్థానిక నాయకులు చంద్రబాబుకు వివరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే.. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో టీడీపీ సీనియర్ నేత, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్ రవి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి చేశారు. కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇవ్వాలంటూ రెస్కో చైర్మన్, వైసిపి నేత సెంథిల్ సోమవారం రాత్రి 10.45 గంటల సమయంలో రవికి ఫోన్ చేయగా అవి తన వద్ద లేవని.. దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించామని ఆయన తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి కొంతమంది కుప్పం నేతాజీ రోడ్డులోని రవి ఇంటిపై మద్యం బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు.

ఈ ఘటనను స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ హయాంలో గంగమ్మ గుడికి సంబంధించి రూ. 96 లక్షలు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ బాండ్లు ఇవ్వాలంటూ వారం రోజులుగా వైసీపీ నేతలు రవిని అడుగుతున్నారు. అవి తన వద్ద లేవని చెప్పినా వినిపించుకోకుండా ఆయన ఇంటిపై దాడికి పాల్పడినట్లుగా రవి తెలిపారు.

ఏపీ వార్తల కోసం..

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే