Hyderabad: బ‌ర్త్‌డే పార్టీకి పిలిచి మైన‌ర్‌పై కారులో..హైదరాబాద్ లో మ‌రో దారుణం

హైదరాబాద్‌ మహా నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. జూబ్లీ హిల్స్ ప‌రిధిలోని ఆమ్నేషియా ప‌బ్ వ‌ద్ద మైన‌ర్‌ బాలిక‌ను అప‌హ‌రించి కారులోనే ఆమెపై గ్యాంగ్ రేప్ జ‌రిగిన ఘ‌ట‌న మరువక ముందే తాజాగా మ‌రో మైన‌ర్ బాలిక అత్యాచారానికి గురైన ఘ‌ట‌న వెలుగు చూసింది.

Hyderabad: బ‌ర్త్‌డే పార్టీకి పిలిచి మైన‌ర్‌పై కారులో..హైదరాబాద్ లో మ‌రో దారుణం
Representational Image
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2022 | 10:12 PM

హైదరాబాద్‌ మహా నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. జూబ్లీ హిల్స్ ప‌రిధిలోని ఆమ్నేషియా ప‌బ్ వ‌ద్ద మైన‌ర్‌ బాలిక‌ను అప‌హ‌రించి కారులోనే ఆమెపై గ్యాంగ్ రేప్ జ‌రిగిన ఘ‌ట‌న మరువక ముందే తాజాగా మ‌రో మైన‌ర్ బాలిక అత్యాచారానికి గురైన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌లో వేగంగా స్పందించిన పోలీసులు బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డ సురేశ్ అనే యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మరో ఘోరం జరిగింది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ప‌రిధిలోని ఆమ్నేషియా ప‌బ్ వ‌ద్ద మైన‌ర్‌ బాలిక‌ను అప‌హ‌రించి కారులోనే ఆమెపై గ్యాంగ్ రేప్ జ‌రిగిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి నేప‌థ్యంలో సోమ‌వారం మ‌రో మైన‌ర్ బాలిక అత్యాచారానికి గురైన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌లో వేగంగా స్పందించిన పోలీసులు బాలిక‌పై అఘాయిత్యానికి పాల్పడ్డ సురేశ్ అనే యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్టప‌గ‌లు నెక్లెస్ రోడ్‌పై చోటుచేసుకోవడం మరింత సంచలనం రేపుతోంది. ఓ మైన‌ర్ బాలికను బ‌ర్త్ డే వేడుక‌ల కోస‌మంటూ నెక్లెస్ రోడ్‌కు తీసుకువ‌చ్చిన సురేశ్‌…నెక్లెస్ రోడ్‌పై కారులోనే ఆమెపై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘ‌ట‌న‌పై బాలిక ఫిర్యాదు చేసిన వెంట‌నే రంగంలోకి దిగిన రాంగోపాల్‌పేట పోలీసులు నిందితుడు సురేశ్‌ను అరెస్ట్ చేశారు.