Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydrogen Car: దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే కారు.. అనుమతులు మంజూరు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..!

Hydrogen Car: ఇటీవల హైడ్రోజన్‌తో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్‌ను అనుమతించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. టయోటా కిర్లోస్కర్ తిరువనంతపురంలోని..

Hydrogen Car: దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే కారు.. అనుమతులు మంజూరు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..!
Hydrogen Car
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2022 | 7:39 AM

Hydrogen Car: ఇటీవల హైడ్రోజన్‌తో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్‌ను అనుమతించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. టయోటా కిర్లోస్కర్ తిరువనంతపురంలోని RTO వద్ద టయోటా మిరాయ్ కారును రిజిస్టర్ చేసింది. ఈ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో జరిగింది. కేరళ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రుసుము మినహా ఎలాంటి పన్ను విధించలేదు. అయితే, హైడ్రోజన్ కార్లను దేశంలో పరిశోధన కోసం మాత్రమే ఉపయోగించేందుకు అనుమతి ఉన్నందున సాధారణ వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయలేరు. కొన్ని నివేదికల ప్రకారం .. ఈ కారు ధర రూ. 1.1 కోట్లు. హైడ్రోజన్ కారు గురించి మరికొంత తెలుసుకుందాం.

పరిశోధన కోసం ఉపయోగించబడుతుంది. టయోటా మిరాయ్ పరిశోధన ప్రయోజనం కోసం మాత్రమే తయారు చేయబడింది. టయోటా మిరాయ్‌ను పరిశోధన కోసం మాత్రమే ఉపయోగించాలనే షరతుతో ప్రభుత్వం హైడ్రోజన్ కార్ రిజిస్ట్రేషన్‌పై పన్నును మినహాయించింది. దేశంలో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు హైడ్రోజన్ ఇంధన స్టేషన్లు అవసరం. హైడ్రోజన్ ఇంధన స్టేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ఈ పరిశోధన జరుగుతోంది.

కర్ణాటకలోనూ హైడ్రోజన్ బస్సులు..

ఇవి కూడా చదవండి

టయోటా మిరాయ్‌ను శ్రీ చిత్ర తిరునాల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఉంచనున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. తిరువనంతపురంలో ఉన్న ఈ కళాశాల ఆటోమొబైల్ కోర్సుకు చాలా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే 10 హైడ్రోజన్ బస్సులు, 50 ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఇది కాకుండా డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది.

హైడ్రోజన్ సాయంతో భారీ వాహనాలను నడిపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హైడ్రోజన్ రీఫిల్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించడంలో మందగమనం కారణంగా టయోటా మిరాయ్‌ను భారతదేశానికి తీసుకురావాలనే ప్రణాళిక నిలిపివేయబడింది. ఈ కారు ఇప్పటికే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT)తో పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి